Advertisement
Google Ads BL

పవన్‌ జీ ఒక్క ట్వీటైనా ట్విట్టు..!


పవన్‌కళ్యాణ్‌.. మొదట్లో ఆయన చిరంజీవి తమ్ముడు. ఆ తర్వాత పవర్‌స్టార్‌.. ప్రస్తుతం ఆయన జనసేనాధినేత. కాగా పవన్‌ తన జనసేన రిక్రూట్‌మెంట్‌ను స్పీడ్‌గా సాగిస్తున్నాడు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక సభ్యుల ఎంపిక జిల్లాల వారిగా మొదలైంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఈ తతంగం ముగిసింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో కూడా కంప్లీట్‌ చేసేశాడు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన రెండు జిల్లాలకు సంబందించిన రాతపరీక్షలు, ప్రసంగాలు, వీడియోలతో తెలంగాణపై దృష్టిపెట్టాడు. 

Advertisement
CJ Advs

నిజం చెప్పాలంటే ఈ ప్రక్రియ చాలా మంచిది. పీఆర్పీలో జరిగిన తప్పులు మరలా పునరావృతం కాకుండా, పలువురు సొంత ఎజెండాతో వస్తున్న వారి పట్ల ఈమాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. పార్టీకి ఆయువు పట్టు వీరే. ఈ జనసైనికులే రేపు పార్టీ సిద్దాంతాలను, మేనిఫెస్టోను తయారు చేయడంలో, ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పాటు వాటి రూపకల్పన, విధివిధానాలు, కింది స్థాయిలో పార్టీ బలోపేతానికి వీరే మూల స్తంభాలు. 

కాకపోతే ఈ ప్రక్రియలో న్యూట్రల్‌ వ్యక్తుల కంటే మెగాభిమానులకే పెద్దపీట వేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇక పవన్‌ ఎంతో కాలంగా ప్రభుత్వం చేసే ప్రతి పనిని, ప్రతి మాటని రాజకీయం చేయనని, అవసరమైన సందర్బాలలో మాత్రమే స్పందిస్తానన్నారు. ఆయన చెప్పిన మాట అక్షర సత్యం. ప్రతి పనిని తప్పుపట్టే పనిలో అసలు చేసే మంచి పనులు కూడా ఆగిపోతుంటాయి. ప్రస్తుతం జగన్‌ చేస్తున్న తీరు ఇదే. విమర్శనాత్మకంగా విశ్లేషించుకుని ముందుకు పోకుండా ఒకటి రెండు రోజులు ధర్నా, నిరాహారదీక్ష చేసి ఆ తర్వాత హాయిగా ఏ న్యూజిలాండ్‌లోనో లేక లోటస్‌పాండ్‌లోనో ఏసీల్లో బజ్జుంటున్నాడు. 

పవన్‌కి అధికారంలోకి రాలేమనో, లేక రాజకీయాలలో గెలుపోటములకు అతీతంగా ఉండాలనో ఉంది. కానీ ఆయన తన వైఖరిని కాస్త మార్చుకోవాలి. రాజ్యాధికారం సాధించనిదే ఉపయోగం లేదన్న అంబేడ్కర్‌ మాటలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక ఆయన 'ఉద్దానం' కిడ్నీ బాధితుల అంశంలో స్పందించాడు. కాస్తైనా నాడు ప్రభుత్వం ఈ విషయంలో స్పందించింది. ఆ సమస్య శాశ్వత పరిష్కారం కోసం పవన్‌ తన సొంతగా ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించానని చెప్పాడు. బాబు గారు కూడా ఓ కమిటీవేశారు. రిజల్ట్‌ ఏమిటో ఎవ్వరికీ తెలియదు. వారు నివేదిక ఇచ్చారా? ఆ సమస్య తగ్గిందా? కనీసం మినరల్‌ వాటర్‌నైనా ఇస్తున్నారా? లేదా? అనేది పట్టించుకోలేదు. పవన్‌ కూడా మౌనవ్రతం చేస్తున్నాడు. 

ఇక ఆనాడు పోలవరం నుంచి పలు ప్రాంతాలల్లో ఫ్యాక్టరీల వల్ల తమ భూములు కలుషితమై పోతున్నాయని, పోలవరం కోసం తవ్విన ఇసుకను తమ పొలాలలో డ్రంప్‌ చేస్తున్నారని, రాయపాటి సాంబశివరావు దానికి కారణమని చెబితే పవన్‌ వీరావేశం తెచ్చుకున్నాడు. తర్వాత అగ్రిగోల్డ్‌ అన్నాడు... చేనేత సమస్యలు అన్నాడు. కేవలం సమస్యలను గుర్తించమంటే పసిపిల్లవాడు కూడా ఆ పని చేసి, తన బాధలేమిటో చెబుతాడు. కానీ పవన్‌ మరలా వాటిపై స్పందించలేడు. 

అడుగుదామనుకుంటే షూటింగ్‌ల్లో బిజీ బిజీ..మరి జగన్‌ కాకపోయినా కనీసం పవన్‌ స్పందిస్తేనైనా ప్రభుత్వంలో కాస్త మేల్కొలుపు వస్తుందని అందరూ ఆశపడుతున్నారు. తాజాగా వైజాగ్‌లో వేల కోట్ల భూదందా నడుస్తోంది. దానిని ప్రశ్నిస్తే.. కనీసం ట్వీట్‌ ట్వీటినా మన అమాయకపు ప్రజలు తమ తరపున పోరాడే వాడు ఒకడున్నాడని భరోసాగా ఉంటారు. మరి ఆ భరోసా కూడా ఇవ్వకుండా, కనీసం ఓ ట్వీటైన ట్వీట్టకుంటే ఎలా పవన్‌ సారూ...! 

People Wants Pawan Reacton on Vizag Land Mafia:

Vizag Land Mafia: Janasena Chief Pawan Kalyan no Reactions on this Issue 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs