మన హీరోలు మరీ ముఖ్యంగా మన స్టార్స్ కొన్ని విషయాలలో నిక్కచ్చిగా ఉన్నా, కొన్ని సందర్బాలలో మాత్రం బాగా ఎమోషనల్ అయిపోతారు. కళాకారులు చాలా సున్నితమనస్కులై ఉంటారని మన పెద్దలు చెప్పింది నిజమే. మన నటీనటులు, స్టార్‌హీరోలు, హీరోయిన్లు.. ఇలా ఎందరో ఆపదల్లో ఉండేవారిని చూసి ఆవేదన చెందుతారు. చిరంజీవి 'బ్లడ్‌బ్యాంక్, ఐబ్యాంకులు' పెట్టింది అందుకే. ఇక ఏదైనా ఆపద వస్తే చాలు... ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా వెంటనే స్పందిస్తారు. నటి హన్సిక ఎందరో అనాధలను చేరదీసి చదివిస్తోంది. రాఘవలారెన్స్ నుంచి విశాల్ వరకు అందరూ స్పందిస్తూ ఉంటారు. పవన్ జనసేన పెట్టింది... ఒకప్పుడు కామన్ ప్రొటెక్షన్ పోర్స్ పెట్టింది దానికోసమే. ఇక ఇలా మన సినీప్రముఖులు ఎంతో ఉదారస్వభావులు.
కానీ కొందరు పాపం.. తమ స్వయాన నటించే తోటి నటీనటులు పడే కష్టాలు కొన్ని సార్లు ఆయా హీరోల వరకు చేరవు. సావిత్రి దీన పరిస్థితిలో ఉంటే దాసరి సహాయం చేశారు. అయినా కొందరు మాత్రం ఉదాహరణకు ఐరన్‌లెగ్ శాస్త్రి నుంచి సుత్తివేలు, రాళ్లపల్లి దాకా ఎందరో ఆపదల్లో ఉన్నారు. వారు తాగుబోతులైన కావచ్చు..లేదా జీవితంలో ఏ తప్పులైనా చేసివుండవచ్చు. కానీ వారు మారిన తర్వాత వారికి చేయూత అందిస్తే బాగుంటుంది. ఇక నాటి 'నాలుగు స్థంబాలాట'తో పాటు బాలనటిగా 'శంకరాభరణం'లో నటించిన శంకరాభరణం తులసిని స్వయాన ఇబ్బందుల్లో ఉందని తెలిసి, అర్జంట్ షూటింగ్ ఉన్నా కూడా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఆమెను చూడటానికి వచ్చాడు. రమ్మంటే ఆమే వచ్చేది. కానీ పెద్దలను గౌరవించే ఎన్టీఆరే ఆమె వద్దకు వచ్చి నేనే వచ్చానమ్మా.. నీకేం భయం లేదు. నేనున్నాను... అని భరోసా ఇచ్చేసరికి తులసి కళ్లల్లో ఆనందభాష్పాలు రాలాయట. ఇక ఆమె వేదన చూసిన ఎన్టీఆర్ కళ్లు చెమడ్చాయట.
దాని గురించి తులసి చెబుతూ, ఎన్టీఆర్ గురించి విన్నాను. కానీ ఎప్పుడు కలవలేదు. ఆయన్ను ఇప్పుడు కలిశాను. భరోసా ఇచ్చాడు. గతంలో నేను 'డార్లింగ్' సందర్భంగా కూడా ప్రభాస్‌ని దీవించాను. ఆయన ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలుసు. నేషనల్ స్టార్ అయ్యాడు. మనస్పూర్తిగా దీవిస్తే అవి ఫలిస్తాయి. నేను కూడా అంతే. భవిష్యత్తులో ఈ ఎన్టీఆర్ నటుడుగా కాదు,... తాతలా మహానుభావుడవుతాడని చెప్పింది. ఇప్పటివరకు తానుగానీ తన కుటుంబసభ్యులు కానీ ఆయనతో కలిసి నటించింది లేదని, కానీ ఆయన అమ్మా అని పిలిచిన తర్వాత తన మనసుకు భరోసా దొరికిందని ఉద్వేగంతో చెప్పడం ఎన్టీఆర్ గొప్పతనానికి నిదర్శనం. ఆయన తులసిలా మరెందరి జీవితాలకో భరోసా ఇవ్వాలని కోరుకుందాం...! అలాగే తులసి మాట పుణ్యమా అని ఎన్టీఆర్ కూడా ప్రభాస్‌లాగా నేషనల్ స్టార్‌గా మారి ఆమె దీవెనలను నెరవేరుస్తాడని ఆశిద్దాం...!