రానా, కాజల్ అగర్వాల్, కేథరిన్ థెరిసా కాంబినేషన్ లో డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్న 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ సినిమా పబ్లిసిటీపై దృష్టి సారించింది. అందులో భాగంగానే సినిమా ఫస్ట్ లుక్ లు, ఫస్ట్ టీజర్ లు అంటూ హడావిడి చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ ట్రైలర్ అల్లు అర్జున్ నటించిన 'డీజే' చిత్రంతో పాటు అన్ని థియేటర్స్ లో ప్రదర్శించబడుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇకపోతే ఈ ట్రైలర్ లో రానా చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి. జైల్లో ఉన్న రానా ని చూపిస్తూ జయప్రకాష్ రెడ్డి 'వాడి జీవిత చరిత్రని టీవీల్లో చూపించడానికి వాడేమన్నా అల్లూరు సీతారామరాజా, సుభాష్ చంద్ర బోసా, భగత్ సింగా' అంటాడు. ఈ మధ్యలోనే రానా, కాజల్ అగర్వాల్ తో చేసే రొమాన్స్ కూడా హై లేవల్లోనే వుంది. ఇక రానా కూడా 'లెక్కేసి కొడితే ఐదేళ్లలో సీఎం కుర్చీ నా ...కిందుండాలి.. 100 ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటల్‌లో పెడితే సాయంత్రానికి నేను అవుతా సీఎం'.. అంటూ రానా చెప్పై డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్ లో చివరిలో రానా 'ఎనకటికో సామెత వుంది...పాముకి పుట్ట కావాలంటే చీమలే కదారా కష్టపడాలి' అంటూ చెప్పే డైలాగ్ ఇంకా బాగుంది. మరి జైల్లో ఉన్న రానా ఎలా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయనేతగా మారాడన్నది ఇంట్రెస్టింగ్ కలిగించే విషయం..
ఇక హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి కాజల్ ఎంతో డీసెంట్ గా ట్రెడిషనల్ గా కనబడుతుండగా... కేథరిన్ మోడరన్ గర్ల్ గా దమ్ముకొడుతూ కనబడుతుంది. రానా కూడా పంచె పైకి కట్టి సిగరెట్ తాగే సన్నివేశం బాగా ఆకట్టుకుంటుంది. ఇక 'నేనే రాజు - నేనే మంత్రి' టెక్నికల్ గా హై స్టాండర్డ్ లో తెరకెక్కినట్లు ప్రతి సీన్ లో తెలుస్తుంది. ఈ చిత్రం తో తేజ తన స్టార్ డమ్ తిరిగి పొందడం ఖాయంగా తెలుస్తుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.