Advertisement
Google Ads BL

'డీజే' ఫస్ట్ టాక్ ఇలా వుంది..!


అల్లు అర్జున్ తాజా చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథం' ఈ శుక్రవారమే భారీ స్థాయిలో విడుదలైంది. పూజ హెగ్డే  హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేశాడు. ఈసారి అల్లు అర్జున్ ఎప్పుడూ కనబడని రీతిలో కనిపించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసున్నాడు. బ్రహ్మణుడిగా అల్లు అర్జున్ మొదటిసారి ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక చిత్రంలో కూడా ఈ రోల్ లో అల్లు అర్జున్ ఫ్రెష్ గా మెరిసిపోతున్నాడు. కాకపోతే 'అదుర్స్' లో ఎన్టీఆర్ బ్రాహ్మణుడి నటనతో పోలిస్తే మాత్రం అల్లు అర్జున్.. ఎన్టీఆర్ నటనకు రీచ్ కాలేదనిపిస్తుంది. ఇక బ్రాహ్మణ డైలాగ్స్ పలకడం కోసం, ఆ యాసలో మాట్లాడడం కోసం అల్లు అర్జున్ మాత్రం బాగా హార్డ్ వర్క్ చేసాడనిపిస్తోంది.

Advertisement
CJ Advs

ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం అల్లు అర్జున్ కష్టపడే సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. అల్లుఅర్జున్ తన రోల్‌, అండర్ కవర్ ఆఫీసర్‌గా పూర్తి న్యాయం చేశాడనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కాస్త సాదాసీదాగా ఉన్నప్పటికీ.... స్టోరీ లెన్త్ ఎక్కువ హైప్ చేయకుండా బాగా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇకపొతే వివాదాస్పదమైన 'గుడిలో ఒడిలో మడిలో' పాట పిక్చరైజ్ చాలా బాగా అనిపించింది. ఇక పూజ హెగ్డే కి అల్లు అర్జున్ కి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ లో ఇద్దరూ పోటీపడి నటించారు. అలాగే పూజ హెగ్డే బికినిలో డిజెలో కనబడుతుందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ చిత్రంలో పూజ నిజంగానే బికినీతో కుర్రకారు మతులుపోగొట్టింది. ఓవరాల్ గా ఈ డీజే ప్రేక్షకులను అలరిస్తుంది.

Duvvada Jagannadham Public Talk:

Allu Arjun's Duvvada Jagannadham first Day Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs