Advertisement
Google Ads BL

బాలయ్య తిట్టింది నిజంగా అభిమానినేనా!


మనస్టార్‌ అంటే వారి అభిమానులకు చచ్చేంత ఇష్టం. కానీ కొందరు ప్యాన్స్‌ ముసుగులో వచ్చి వారితో ఫొటోలు దిగి వాటిని పలు చెడుపనులకు ఆయుధంగా మారుస్తున్నారు. ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న వ్యక్తి సీఎం చంద్రబాబు నుంచి బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌లను కూడా కలిసి తీసుకున్న ఫొటోలు పోలీసులకు దొరికేసరికి అదే పెద్ద సంచలనమై పోయి సదరు నాయకులు, హీరోల మీద కూడా యాంటీ ప్యాన్స్‌ మండిపడుతున్నారు. 

Advertisement
CJ Advs

కొందరు యాంటీ ఫ్యాన్స్‌ కావాలనే పలువురు ఇతర హీరోలతో ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. గతంలో పూరీ తీసిన 'పోకిరి' చిత్రంలో నేను రజనీ కాంత్‌, చిరంజీవి అందరితో దిగిన ఫొటోలున్నాయి.. అందరికీ ఈ స్కాంలో ఇరికిస్తాను అనే మాదిరిగా విలన్‌ ప్రకాష్‌రాజ్‌పై కొన్ని సీన్లు ఉన్నాయి. అది పచ్చినిజం. ఇక తాజాగా బాలయ్యతో ఓ అభిమాని ఫొటో దిగడానికి ప్రయత్నిస్తే బాలయ్య మండిపడిన విషయం తెలిసిందే. 

కాగా గతంలో కూడా చిరంజీవిని ఇలాగే ఒకరు హింసిస్తే చిరు వార్నింగ్‌ ఇచ్చాడు. ఇక అసలే షార్ట్‌టెంపర్‌ మీద ఉండే బాలయ్య ఓ అభిమాని ఫోన్‌ చేసినప్పుడు, సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని అత్యుత్సాహ పడి ఆయన కాలిని తొక్కినప్పుడు తోసేసి, తిట్టడం వంటివి చేశాడు. తప్పదు.. నేటి సాంకేతిక యుగంలో ఆ మాత్రం కఠినంగా ఉండకపోతే అసలుకే చెడ్డపేరు వస్తోంది. కానీ బాలయ్య ఘటనను కూడా తాజాగా పలువురు యాంటీఫ్యాన్స్‌ వివాదం చేయాలని చూస్తూ వుండడం దౌర్భాగ్యమనే చెప్పాలి. 

ఈ విషయంలో మన హీరోలు కూడా రజనీలా మారాలి. విడిగా, లేదా షూటింగ్‌లలో కలిసి ఫొటోలు దిగుతానంటే ఆయన సున్నితంగా తిరస్కరిస్తాడు. తన అభిమానులతో ఫొటోలు దిగడం కోసం, మాట్లాడటం కోసం కొన్నిరోజులు కేటాయిస్తాడు. 

Balayya Angry on Anty Fans:

Tollywood Stars Chiranjeevi and Balakrishna and Others takes Care with Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs