స్వర్గీయ దాసరిది సపరేట్ స్టైల్. కాస్త ఆవేశంగా ఇతరులను దూరం చేసుకున్నా కూడా తర్వాత కలుపుకుపోతాడు. రామోజీరావు నుంచి చిరంజీవి వరకు అంతే. కాగా ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం పుణ్యమా అని వీరి మద్య మరలా మంచి స్నేహం వచ్చింది. మరో పక్క పవన్ అడిగిన వెంటనే ఆయనకు ఓ సినిమా చేస్తానని మాట ఇవ్వడం, అల్లువారి వేడుకకు, చిరు రీఎంట్రీ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెంబర్ 150 ' వేడుకకు చీఫ్‌గెస్ట్‌గా రావడం, చిరు దాసరిపై, దాసరి చిరుపై పొగడ్తలతో తమ ఆప్యాయతను చాటుకున్నారు.
ఇక తాజాగా బన్నీ, చరణ్‌లు వేర్వేరు వేడుకల్లో ఆయన సంతాపానికి మౌనం పాటించారు. కాగా చిరు-దాసరి మధ్య ఓ కీలక నేత మనస్పర్ధలు తొలగేలా చేశాడు. కానీ అంతలోనే దాసరి స్వర్గస్తులైనారు. కాగా దాసరి తాను బతికుండగా, అనారోగ్యంతో బాధపడేటప్పుడు కూడా చిరు చాలా సాధుమనిషి. సున్నితమైన మనసు. కానీ మోహన్‌బాబుది పట్టిందే పట్టు. వారిని కూడా కలపాలని, తాను ఆ పని చేసి చూపిస్తానని అందరితో అనే వాడని సమాచారం. దాసరి బతికుంటే ఇప్పటికే తాననుకున్నది సాధించేవాడు.
ఇక మెగాబ్రదర్ నాగబాబు కూడా దాసరి మరణం తర్వాత సినిమా పరిశ్రమ పెద్దదిక్కునే కోల్పోయింది. అయినా ఆ బాధ్యతలు నిర్వహించడానికి మోహన్‌బాబు వంటి పెద్దలున్నారు అని వ్యాఖ్యానించాడు. అప్పటివరకు దాసరి తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మారుతారని భావించారు. కానీ నాగబాబు.. మోహన్‌బాబు పేరు చెప్పడంతో చిరు, మోహన్‌బాబుల మధ్య కూడా స్పర్దలు తొలగాయని భావించారు.
కానీ తాజాగా జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చూపుతూ చిరు, బాబుల మధ్య ఇంకా సరైన సంబంధాలు లేవని సోషల్‌మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు గంటారవి నటించిన 'జయదేవ్' ఆడియో వేడుకకు ముఖ్య అతిధులుగా చిరంజీవి, మోహన్‌బాబు, టి.సుబ్బిరామిరెడ్డి వచ్చారు. ఫంక్షన్‌లో ఆడియో సీడీ ఆవిష్కరించడానికి చిరంజీవిని , మిగిలిన వారిని వేదికపైకి పిలిచారు. తీరా చిరు ఆడియో సిడీని విడుదల చేయడం చూసి మోహన్‌బాబు కోపంతో వేదిక దిగిపోయాడని, ఆ తర్వాత ఆయన్ను వేదిక మీదకు పిలిస్తే నాలుగు మాటలు మాట్లాడి చిరు ప్రసంగించకముందే ఆయన ఫంక్షన్ నుంచి వెళ్లిపోయాడంటున్నారు.
సహజంగా శత్రువునైనా నవ్వుతూ పలకరించే చిరు కూడా మోహన్‌బాబుతో వేడుకలో ఎడమొహం పెడ మొహంగా ఉన్నారని, ఇద్దరు కలిసి మాట్లాడుకోలేదంటున్నారు. ఇదే నిజమైతే మాత్రం దాసరి ఆత్మ ఇంకా క్షోభిస్తుందనే చెప్పాలి.