Advertisement
Google Ads BL

మెగాఫ్యామిలీపై ఈ వార్తలు పుడుతూనే ఉంటాయా!


మెగాకాంపౌండ్‌లోని పలువురు మేమంతా ఒక్కటే అని ఎన్నిసార్లు చెబుతున్నా వాళ్ల వైఖరిపై మాత్రం అనుమానపు నీడలు పోలేదు. బన్నీ.. పవన్‌ ఫ్యాన్స్‌ని గురించి 'చెప్పను బ్రదర్‌' అనేశాడు. కానీ ఏదో ఆవేశంలో అన్నాడులే అని పలువురు భావించారు. కానీ బన్నీ ఊరికే అనలేదని, ముందస్తుగానే పవన్‌ ఫ్యాన్స్‌ గోల చేసే ఆ మాట అనాలనే అన్నాడని తేలిపోయిందంటున్నారు. ఎందుకంటే ఆ తర్వాత కూడా బన్నీ.. పవన్‌కు, ఆయన ఫ్యాన్స్‌కు సర్థిచెప్పడం, జరిగిన వ్యవహారాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం జరగలేదు. తాజాగా కూడా బన్నీ జర్నలిస్ట్ లను అలాంటి ప్రశ్నలు వేయద్దు బ్రదర్‌ అనడం చూస్తే ఆయన తాను తప్పేమి చేయలేదనే కాన్ఫిడెన్స్‌, పవన్‌ అభిమానులు దూరమైనా ఫర్వాలేదనే నిర్ణయానికి వచ్చినట్లుంది. 

Advertisement
CJ Advs

మరోవైపు ఆ దిశగా ఆలోచించి, బన్నీపై వ్యతిరేకతతో పవన్‌ ప్యాన్స్‌ బన్నీ చిత్రాల ఫస్ట్‌లుక్స్‌ నుంచి ట్రైలర్స్‌ వరకు డిజ్‌లైక్‌లు కొడుతుండటంతో అల్లుఅరవింద్‌ బన్నీ చేత క్షమాపణ, తొందరపాటు అని చెప్పించాలని చూశాడని, కానీ బన్నీ వినలేదంటున్నారు. మరోవైపు మెగాభిమానులందరూ మనవారే అన్న విధంగా ఉండాలని, కలిసి ఉంటేనే బాగుంటామని బన్నీకి చిరు క్లాస్‌ పీకాడని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా 'డిజె' ఆడియో వేడుకకు తన ఫ్యామిలీతో సహా వచ్చిన అల్లు కుటుంబం.. చిరు రాకపోవడంతో మరలా అనుమానాలు మొదలయ్యాయి.

ప్రతి మెగాహీరో వేడుకకు (పవన్‌ మినహా) చిరు వచ్చి ఆశీర్వదించడం, ఆడియో ఆవిష్కరించడం జరిగేవి. ఇక డిజెలోని పాటలను ఒక్కోటి రిలీజ్‌ చేసేటప్పుడు పవన్‌ చేత ఓ పాటను కూడా విడుదల చేయించాలని చూసినా అది నెరవేరలేదు. ఇక చిరుకి మిగతా హీరోలు రిలీజ్‌కు ముందే సినిమాని స్పెషల్‌ షో వేసి చూపిస్తారు. కానీ ఈ సారి ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరగలేదని టాక్‌. ఇదేమని అడిగితే దాసరి మరణం వల్ల ఈ వేడుకకు ఎవ్వరినీ గెస్ట్‌లను ఆహ్వానించలేదని బన్నీ చెబుతున్నాడు. మరి అల్లు కుటుంబం కూడా మెగా ఫ్యామిలీలో భాగమే కదా..! అనే అనుమానాలు వస్తున్నాయి. పైగా చిరు మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడి మొదటి సినిమా వేడుకకు వచ్చి మంచి స్పీచ్‌ ఇచ్చాడు. మరి దాసరి మరణమే చిరు, బన్నీల బాధ అయితే ఆ ఆడియోకు ఎందుకు వచ్చాడు? అనేది చిక్కు ప్రశ్నగా మారింది. 

ఇక చిరు తన 150,151 ఇలా రెండు చిత్రాల నిర్మాణాన్ని తన కుమారుడు చరణ్‌కి ఇవ్వడం, ఆయన రీఎంట్రీని అల్లు క్యాష్‌ చేసుకోలేకపోవడం, చిరు మాట తప్పి తన కొడుకు ప్రాధాన్యం ఇచ్చి 102వ చిత్రాన్ని తనకివ్వడం అరవింద్‌ జీర్ణించుకోలేకపోతున్నాడని, అదే సమయంలో చిరు తనయుడు చరణ్‌.. బన్నీ కంటే రేసులో వెనుకబడి పోవడం, నాగబాబును మంచి చేసుకోవడానికే 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా'లో లగడపాటి శ్రీధర్‌ని నాగబాబుని కలిపి నాగబాబుని ఆర్దికంగా మరలా నిలబెట్టి సింపతీ కోసం అల్లు ఫ్యామిలీ చూస్తోందని, సొంత అన్నదమ్ములు చేయని సినిమా సాయం తాము చేశమనే పబ్లిసిటీ కోసమే ఈ తతంగం అంతా జరుగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Hot Hot Rumors on Mega Family:

Differences between Allu and Mega Family. Allu Heroes sees uppar hand on Mega heros. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs