Advertisement
Google Ads BL

మంజిమా కూడా స్కిన్‌షో పై క్లారిటీ ఇచ్చింది!


కొంతమంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత గ్లామర్‌షో, స్కిన్‌షో చేయడాన్ని ఇష్టం లేకున్నా ఒప్పుకుంటారు. ఇక సినిమా అవకాశాలు లేకపోయినా ఫర్లేదు.. ఖాళీగా అయినా ఉంటాం గానీ తగ్గేదే లేదని కొందరు భీష్మించుకుని కూర్చుంటారు. అలాంటి వారు కూడా సినిమాలలో లాంగ్‌రన్‌తో నడిపిన వారు కూడా ఉన్నారు. పాత వారిని వదిలేస్తే అకాల మరణం పొందిన సౌందర్య ఆ కోవలోకే వస్తుంది. తన కెరీర్‌లో గ్లామర్‌కి, అశ్లీలతకు తేడా చెరిపివేయకుండా చూసుకుంది. 

Advertisement
CJ Advs

ఇక నేటి హీరోయిన్లలో మలయాళీ కుట్టీ అయిన కీర్తి సురేష్ టాప్‌స్టార్స్‌తో చేస్తున్నా కూడా నో ఎక్స్‌పోజింగ్‌ అంటోంది. ఆమెను ప్రేక్షకులు, మన స్టార్స్‌ కూడా బాగానే ప్రోత్సహిస్తున్నారు. ఇక ఎవరైనా హీరోయిన్‌ అద్భుతంగా ఉంటే ఆమెను తెలుగులో బాపు బొమ్మ అంటారు. ఇక హీరోయిన్లను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావు, కృష్ణవంశీ వంటి వారు ఉన్నారు. వీరు ఎంతో రొమాంటిక్‌గా చూపిస్తారే గానీ అశ్లీలత చేయరు. ఇక తమిళంలో అలాంటిపేరు మణిరత్నం, గౌతమ్‌మీనన్‌లకు ఉంది. ఐశ్వర్యారాయ్‌ నుంచి నిత్యామీనన్‌ వరకు మణిరత్నం తన హీరోయిన్లను ఎంతో అందంగా చూపిస్తారు. ఇక గౌతమ్‌మీనన్‌ చిత్రం ద్వారా ఎంటర్‌ అయిందంటే ఆమెకు కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు ఆహ్వానాలు వెయిట్‌ చేస్తుంటాయి. ఈమద్యకాలంలో అలా టాప్‌కెళ్లిన వారిలో సమంత ఒకరు. ఇక మరో మలయళీ నిత్యామీనన్‌.

'ప్రేమమ్‌' బ్యూటీ సాయిపల్లవి అయితే మణి, మీనన్‌ చిత్రాలకు కూడా నో చెప్పింది. కాగా మీనన్‌ నాగచైతన్యతో, తమిళంలో శింబుతో తీసిన 'సాహసం శ్వాసగా సాగిపో' బ్యూటీ మంజిమామోహన్‌ గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రం హిట్‌ కాకపోవడంతో మంజిమాకు పెద్దగా అవకాశాలు లేవు. దాంతో ఆమె గ్లామర్‌షో, స్కిన్‌షో చేయడానికి సిద్దపడిందనే వార్తలు వచ్చాయి. దాంతో ఆ భామ ఘాటుగా స్పందించింది. 

అవకాశాలు లేకపోతే ఇంట్లో ఖాళీగానే ఉంటాను గానీ స్కిన్‌షోను జీవితాంతం చేయనంది. తాను ఎలాగైతే తన తల్లిదండ్రులతో, కుటుంబంతో ఎలాంటి సినిమాలు చూస్తానో అలాంటివే చేస్తానని, నేటి ప్రేక్షకులకు గ్లామర్‌కి, అశ్లీలతకు ఉన్న తేడా బాగా తెలుసునంటూ సదరు వార్తలు రాస్తున్న వారికి ఘాటు రిప్లయ్ ఇచ్చింది. 

Manjima Mohan Clarity on Exposing:

Manjima Mohan Fired on Exposing News on Her. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs