Advertisement
Google Ads BL

బాలయ్య మరో హీరోయిన్ ఈ భామే...!


బాలకృష్ణ అటు నయనతార, శ్రియ, అనుష్క వంటి వారితో నటిస్తూనే యువహీరోయిన్లను, కొత్తవారిని కూడా చేరదీస్తుంటాడు. రాధికా ఆప్టే నుంచి ఎందరితోనే నటిస్తుంటాడు. ఇక తన వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' విజయంతో జోరు మీదున్న ఆయన పూరీజగన్నాద్‌ దర్శకత్వంలో 'పైసా వసూల్‌' చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో కేవలం తన నటన, గెటప్‌లతోనే గాక హీరోయిన్ల చేత కూడా చిందులేయించి, సినిమాను చూసిన ప్రేక్షకులు 'పైసావసూల్‌' మూవీ అని అనిపించడానికి శ్రమ పడుతున్నాడు. ఇప్పటికే పోర్చుగల్‌లో వీరోచిత విన్యాసాలు చేస్తున్నాడు. మరోపక్క బాలయ్యను సరికొత్తగా చూపించేందుకు హెయిర్‌స్టైల్‌ నుంచి డ్రసింగ్‌ వరకు ప్రాధాన్యం ఇస్తున్న పూరీ బాలయ్యను డిఫరెంట్‌ యాంగిల్‌, యూత్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక దీనికి గాను ప్రముఖ స్లైలిస్ట్‌లను ప్రత్యేకంగా రప్పించారు. ఈ చిత్రంలో 'గౌతమీ పుత్రశాతకర్ణి'లో నటించిన శ్రియ ఓ మంచి పాత్రను చేస్తుండగా, రెండో హీరోయిన్‌ పేరు ముస్కాన్ అని ప్రకటించారు. కానీ ఈమె ఫొటో ఇంతకాలం మీడియా దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

మాఫియాడాన్‌ పాత్ర కోసం శ్రియా, మరో యంగ్‌ గెటప్‌ కోసం ఈ ముస్కాన్‌సేధీ అన్నమట. ఈమె ముంబైలో మోడలింగ్‌, ర్యాంపువాక్‌లు, ఫొటో షూట్లతో కనిపించదని తెలుస్తోంది. అంతకు మించి ఆమె వివరాలను తెలపడానికి యూనిట్‌ ఇష్టపడటం లేదు. సినిమా ప్రమోషన్స్‌, ఇంటర్వ్యూల నాటికి గానీ ఆమె గురించి వివరాలు తెలిసేలా లేవు... సెప్టెంబర్‌29న విడుదల కానున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్టెట్‌తో తెరకెక్కిస్తోంది. 

Paisa Vasool Heroine Muskan Pic Leaked:

Muskan Seti is the Balakrishna and Puri Jagannadh Paisa Vasool Movie Heroine
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs