Advertisement
Google Ads BL

సావిత్రి కోసం ఎన్టీఆర్ దిగివస్తాడా..?


అశ్వినీదత్ అల్లుడు, ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ అశ్విన్ ఎంతో ప్రతిష్ట్మాకంగా మహానటి సావిత్రి బయోపిక్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చెయ్యడమే కాక ఆ సినిమాని పట్టాలు కూడా ఎక్కించేశాడు. ఎన్నో నెలలు మహానటి సావిత్రి జీవితంపై అధ్యయనం చేసి స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకుని  మరీ నాగ్ అశ్విన్ ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఈ చిత్రంలో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన నాగ్ అశ్విన్ జెమిని గణేశన్ పాత్రకి దుల్కర్ సల్మాన్ ని తీసుకున్నాడు. అయితే మహానటిలో మరో ముఖ్యపాత్రకి అందాల భామ సమంతని కూడా ఎంపిక చేశారు.

Advertisement
CJ Advs

ఈ చిత్రం మే నెలాఖరున పూజా కార్యక్రమాలతో మొదలై షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై బోలెడంత హైప్ క్రియేట్ అవ్వడమే కాదు భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఇప్పుడు మహానటి సావిత్రి సినిమాపై ఒక వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే సావిత్రి నిజ జీవితంలో ఎన్టీఆర్ తో చాలా సినిమాల్లో నటించింది. మరి సావిత్రి నట జీవితంలో ఎన్టీఆర్ కి చాలా ప్రాముఖ్యత వుంది. అందుకే ఈ సావిత్రి బయోపిక్ లో ఎన్టీఆర్ కేరెక్టర్ ని జూనియర్ ఎన్టీఆర్ తో చేయించాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ను కలిసి చర్చలు జరుపుతున్నారని... అయితే ఎన్టీఆర్ సైడ్ నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు.

మరి ఎన్టీఆర్, సావిత్రి బయోపిక్ లో తన తాతగారి పాత్రలో నటించేందుకు ఒప్పుకుంటాడో లేదో అనేది ప్రస్తుతానికి సస్పెన్సు. మరోపక్క అశ్విని దత్, ఆయన కూతుళ్లతో  ఉన్న స్నేహంతోనైనా ఎన్టీఆర్ ఈ కేరెక్టర్ చేస్తాడనే ప్రచారమూ జరుగుతుంది.

Jr NTR to Do Sr NTR in Mahanati?:

Legendary actress Savithri's biopic is being made as 'Mahanati'. Several stars are sporting crucial roles in the movie. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs