Advertisement
Google Ads BL

ప్రభాస్...రాజమౌళిని అంత మాట అనేశాడేంటి?


భల్లాళదేవగా బాహుబలిలో అదిరిపోయే నటనతో జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న రానా తాజాగా బుల్లితెర మీద 'నెంబర్ వన్ యారి' అనే షో కి హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ షో ఈ నెల 25 నుండి జెమిని ఛానల్ లో ప్రసారం కానుంది. అయితే ఇప్పుడు ఈ 'నెంబర్ వన్ యారి' షో కి సంబందించిన ప్రోమో ని ఒకటి విడుదల చేసింది జెమిని ఛానల్. ఈ ప్రోమోలో బాహుబలితో అద్భుతమైన విజయాన్ని అందించిన ఎస్ ఎస్ రాజమౌళి, .... రానా నెంబర్ వన్ యారి షో కి గెస్ట్ గా రాగా, అక్కడ రానా  షో మధ్యలో రాజమౌళితో  ప్రభాస్ కి ఫోన్ చేయించాడు. స్పీకర్ ఆన్ చేసి మరీ హలో డార్లింగ్ అర్జెంట్ గా నిన్ను కలవాలని రాజమౌళి, ప్రభాస్ ని అడగ్గా, ఎందుకలాగా అని ప్రభాస్ అడగ్గా, రాజమౌళి 'బాహుబలి పార్ట్ 3' అనగానే ప్రభాస్ వెంటనే తడుముకోకుండా.. 'అమ్మ నీయమ్మ' అంటూ అదిరిపోయే రియాక్షన్ ఇచ్చాడు.

Advertisement
CJ Advs

ప్రభాస్ అలా 'అమ్మ నీయమ్మ' అనగానే అక్కడే వున్న రాజమౌళి, రానాలు ఎంతలా ఆశ్చర్యపోయారో ప్రోమో చూసిన వారికి తెలుస్తుంది. మరి బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఎంతలా కష్టపడి అలసిపోయివుంటే ఇలాంటి రియాక్షన్ ఇచ్చాడో కదా.. అయినా ఎంత కష్టపడితేనేంటి అద్భుతమైన విజయాన్ని తమ ఖాతాలో వేసుకుని ఇప్పుడు జాతీయ స్థాయిలో క్రేజ్ కొట్టేశారు.  మళ్ళీ అంతటి కష్టం వెంటనే అనేసరికి ఇలాంటి రియాక్షన్ రాక ఎలాంటి రియాక్షన్ వస్తుంది డార్లింగ్ అంటూ హ్యాపీగా  నవ్వేసుకుంటున్నారు అంతా.

ఇక ఈ షో ప్రోమోలో రానా, రాజమౌళిని ఉద్దేసింది ఎవరిపేరు చెప్పినా బాణం సెంటర్ లో తగలేదు, గురి తప్పుతూనే వుంది..కానీ పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే రాజమౌళి వేసిన బాణం వెళ్లి సెంటర్ లో కరెక్ట్ టార్గెట్ లో గుచ్చుకోవడం ఈ షోకి మరో సెంట్రాఫ్ అట్రాక్షన్. మరి ఈ ప్రోమోని చూస్తుంటే రానా బుల్లితెరమీద కూడా ఓ ఆట ఆడుకునేలానే కనిపిస్తున్నాడు. 

Prabhas Reaction on Baahubali 3:

Prabhas Answer to Rajamouli Baahubali 3 Question at Rana show No 1 Yaari
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs