Advertisement
Google Ads BL

దువ్వాడ జగన్నాధం చేతిలో వుంది అదేనా..!


'అ..ఆ' చిత్రంలో హీరోయిన్‌ సమంత చేతిలో ఓ బాల్‌ ఉంటుంది. అది టెన్షన్‌ రిలీఫ్‌కి వాడే వస్తువు. ఇప్పుడు డిజెలో కూడా అలాంటి వస్తువే మరోటి కనిపించనుంది. 'డిజె' ఆడియో వేడుక జరిగినంత సేపు ఓ చిన్న వస్తువు బన్నీచేతిలో ఉంది. ఆయన కొడుకు అయాన్‌ కూడా వచ్చాడు కాబట్టి అదేదో ఆటవస్తువుగా అందరూ భావించారు. ఇక ఈ చిత్రం మేకింగ్‌ వీడియోలలో బన్నీ.. హరీష్‌శంకర్‌తో ముచ్చటిస్తున్పప్పుడు, మోనిటర్‌ చూస్తున్నప్పుడే గాక తాజాగా విడుదలైన 'సిటీమార్‌' ప్రోమోలో కూడా అది కనిపించడంతో తమ హీరో చేతిలో ఉన్నది ఏమిటబ్బా? అని ఫ్యాన్స్‌ ఆలోచనలో పడ్డారు. 

Advertisement
CJ Advs

అది 'ఫిడ్జెట్‌ స్పిన్నర్‌'. దీనినే 'ట్రై స్పిన్నర్‌' అని కూడా అంటారు. 'డిజె' చిత్రంలోని యాక్షన్‌ సీన్స్‌లో తన టెన్షన్‌ని తగ్గించుకునేందుకు ఈ డిఫరెంట్‌ వస్తువును ఆడుతూ బన్నీ ఫైట్స్‌ చేస్తాడు. మొత్తానికి బన్నీ క్యారెక్టర్‌ని హరీష్‌శంకర్‌ భలే డిజైన్‌ చేసినట్లే కనిపిస్తోంది. రాజమౌళి చిత్రాలలో వాడే ఆయుధాల తరహాలో ఈ సినిమా కూడా హిట్టయితే ఈ స్పిన్నర్‌ను వాడటం యూత్‌కి ఫ్యాషన్‌గా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. 

Fidget spinner in DJ allu arjun's hand:

Allu Arjun Using Fidjet Spinner in Dj Duvvada Jagannadham
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs