Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ షో పై ఎందుకింత వ్యతిరేకత?


బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ షోని ఇప్పుడు ఇక్కడ తెలుగులో కూడా దింపబోతున్నారు....  స్టార్ మా ఛానల్ వారు. అదీ అలాగిలాగా కాకుండా స్టార్ హీరో అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఈ బిగ్ షో కి హోస్ట్ ని చేసి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి సిద్ధమవుతోంది. మరి బుల్లితెర మీద ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న షో కాబట్టి ఈ షో కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అయితే ఈ బిగ్ బాస్ షో బాలీవుడ్ లో సెన్సేషన్ తోపాటు చాలా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యి సక్సెస్ అయ్యింది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు టాలీవుడ్ బిగ్ బాస్ షో అంతా ముంబైలోనే బాలీవుడ్ బిగ్ బాస్ కోసం వేసిన సెట్స్ లోనే తెరకెక్కిస్తున్నారట. అలాగే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే  పార్టిసిపెంట్స్ ని కూడా ఎంపిక చేసే ఏర్పాట్లను  స్టార్ మా ఛానల్ స్టార్ట్ చేసిందట. మరి ఈ షోలో ఎక్కువగా సెలబ్రిటీస్ నే తీసుకుంటారు గనక... టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీస్ కి స్టార్ మా బిగ్ బాస్ షో కోసం ఆహ్వానాలు కూడా పంపుతుందట. మరి ఈ ఆహ్వానాలను పంపిన వారిలో ఒక సీనియర్ హీరో కూతురు, హీరోయిన్ కోసం ప్రయత్నాలు మొదలెట్టిన ఒక డైరెక్టర్ కూతురు ఉన్నారట. 

అయితే ఆ సీనియర్ హీరో తన కూతురు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చెయ్యదని స్పష్టం చేసాడట. అలాగే సదరు డైరెక్టర్ కూడా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాడనే టాక్ వినబడుతుంది. టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరూ ఈ షో లో పాల్గొనడానికి సుముఖంగా లేరని తెలుస్తుంది. మరి వారు ఇంత వ్యతిరేకత చూపడానికి కారణం బాలీవుడ్ బిగ్ బాస్ షో లో జరిగిన వివాదాలే కారణంగా చెబుతున్నారు.

Tollywood's Celebs Turning Down NTR's Bigg Boss!:

Young Tiger NTR's TV reality show Bigg Boss has generated huge splash among TV viewers and are eagerly waiting for the start of the show.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs