బాహుబలితో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఒక్కసారిగా ప్రపంచాన్ని అంతటిని తనవైపు తిప్పేసుకున్నాడు. ఒక్క బాహుబలితోనే రికార్డులు క్రియేట్ చేసిన ప్రభాస్ బాలీవుడ్ ని కూడా దున్నేశాడు. అక్కడ బాక్సాఫీస్ ని దడదడలాడించి ఖాన్స్ త్రయానికి ముచ్చెమటలు పట్టించాడు. అయితే 'బాహుబలి' ని బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేశాడు. ఆ సినిమా సాధించిన ఘన విజయంతో కరణ్ జోహార్ బాలీవుడ్ సెలెబ్రిటీస్ కి బాహుబలి టీమ్ కి అప్పట్లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. అయితే ఆ పార్టీకి బాహుబలి హీరో ప్రభాస్ హాజరుకాలేదు. 'బాహుబలి' సినిమా ప్రమోషన్స్ కి బై బై చెప్పేసిన ప్రభాస్ అమెరికా చెక్కేశాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 'సాహో' కోసం మేకోవర్ అయ్యే బిజీలో వున్నాడు.
ఇక అన్ని పనులు ముగుంచుకుని ఇండియాలో ల్యాండ్ అయిన ప్రభాస్ కి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ మళ్ళీ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు,. ఈ పార్టీకి చాలామంది సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఇక్కడివరకు బాగానే వుంది. అయితే ఈ పార్టీకి వచ్చిన ప్రభాస్ తో కరణ్ జోహార్ ఒక భారీ డీల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. కరణ్ జోహార్.. ప్రభాస్ తో 150 కోట్ల భారీ డీల్ చేసినట్టు, ఈ డీల్ కి ప్రభాస్ కూడా ఓకె చెప్పినట్లు ప్రచారం షురూ అయ్యింది. ఈ డీల్ ప్రకారం కరణ్ జోహార్‌కి ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
ఇది గనక నిజమే అయితే ఒక టాలీవుడ్ హీరోకి బాలీవుడ్ లో ఇంత భారీ ఆఫర్ రావడమనేది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. కరణ్ జోహార్‌తో ప్రభాస్ 150 కోట్ల డీల్ ఒక విధంగా రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. అంటే 'సాహో' చిత్రం తర్వాత ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ లెవల్లో ఉండబోతుందని ఈ డీల్ ని బట్టి అర్ధమవుతుంది.