కిందటి సంక్రాంతికి ఎవరు చెప్పినా వినకుండా జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో వచ్చాడు. బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్' కూడా బరిలోకి దిగడంతో బాబాయ్‌ని మంచి చేసుకోవాల్సింది పోయి ఇలా పోటీ పడి సినిమా రిలీజ్ చేయడం ఏమిటి? సీనియర్ అయిన బాలకృష్ణకు ఎన్టీఆర్ గౌరవం ఇవ్వాలి కదా అనే విమర్శలు వచ్చాయి.
ఇక ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి చంద్రబాబుతో కలిసి బాలయ్య థియేటర్లను దొరకనివ్వలేదని, చాలా చెత్త థియేటర్లలో సర్దుకుపోవాల్సివచ్చిందని, దాంతోనే సూపర్‌హిట్ కావాల్సిన ఆ చిత్రం హిట్ వద్దనే నిలిచిందనే వార్తలు కూడా హల్‌చల్ చేశాయి. నందమూరి అభిమానులు కూడా ఆ పరిస్థితి వల్ల అయోమయంలో పడ్డారు.
ఇక ఈసారి దసరా కానుకగా బాలయ్య తాను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పైసా వసూల్'కి సెప్టెంబర్ 29న విడుదల అని విడుదల రోజే అనౌన్స్ చేశారు. మరోపక్క ఎన్టీఆర్ బాబి దర్శకత్వంలో అందునా కళ్యాణ్‌రామ్ నిర్మాతగా తెరకెక్కుతోన్న 'జై లవ కుశ' కూడా దసరాకే వస్తుందని అభిమానులు భయపడ్డారు.
కానీ 'జై లవ కుశ' చిత్రాన్ని ఇంకా వేగంగా షూటింగ్ జరిపి సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో రిలీజ్ చేసి తన బాబాయ్ కంటే కనీసం 15 నుంచి 20రోజుల గ్యాప్ తీసుకోవాలనే నిర్ణయానికి ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సో.. ఈసారి నందమూరి అభిమానులకు మిగతా హీరోలను నుంచి తప్ప వారిలో వారికి పోటీ ఉండదనే చెప్పాలి...!