ఇప్పుడు దేశ విదేశాలల్లో యోగా గురించిన అవగాహన పెరుగుతోంది. మన ఋషులు, యోగులు కనిపెట్టిన దీనికి ఇప్పటికైనా మంచి ప్రాచుర్యం రావడం అభినందించదగ్గ విషయమే గాక భారతీయులుగా గర్వపడాల్సిన విషయం. తాజాగా మనతో అనధికార యుద్దం చేస్తోన్న శత్రుదేశం పాకిస్తాన్ ప్రభుత్వం సైతం యోగా గురు రాందేవ్ బాబాను తమ దేశానికి వచ్చి కొందరికి యోగాలో శిక్షణ ఇవ్వమని కోరారు.
ఇక నేడు దేశంలో కొందరు యోగా మాస్టర్లుగా బాగా రాణిస్తున్నారు. ముఖ్యంగా యోగా అన్నది శరీరం నాజూకుగా ఉండటానికే గాక టెన్షన్, బరువు పెరగడం, తగ్గడం నుంచి సర్వరోగ నివారిణిగా చెప్పుకోవచ్చు. అందుకే హీరోయిన్ భూమికాచావ్లా కూడా యోగా టీచర్ భరత్‌ఠాకూర్‌ని పెళ్లాడింది. ఇక స్వీటీ అనుష్క యోగా టీచర్ అనేది అందరికీ తెలిసిందే.
ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అనుష్క మాట్లాడుతూ నాలో ఎన్నో మార్పులకు ఈ యోగానే కారణం. నేను ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. అయినా వాటి మీద కాకుండా యోగా మీద దృష్టిపెట్టాను. బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో యోగా టీచర్‌గా పనిచేశానని తెలిపింది. ఇక యోగా వల్లనే ఆమె అనుకున్న విధంగా 'సైజుజీరో' చిత్రంలో లావుగా, సన్నగా కనిపించిందని, ఆమెకు ఇంత వయసు ఉన్నా కూడా ఇంకా స్వీట్ 16 అనిపిస్తోందంటే అది యోగా వల్లనే అంటారు.
ఇక యోగా వల్ల వచ్చిన ఫిజికల్ ఫిట్‌నెస్, ఫ్లెక్సిబులిటీ రావడంతోనే యుద్దవిద్యలైన కత్తిసాము వంటి పాత్రలలో 'అరుంధతి, రుద్రమదేవి'లలో నటించింది. 'బాహుబలి' ద్వారా నేషనల్ స్టార్‌గా మారింది. కాగా ఆమె పూరీజగన్నాథ్ కాంబినేషన్‌లో నాగార్జున, సోనూసూద్‌లు నటించిన 'సూపర్' ద్వారా తెలుగులోకి ప్రవేశించి విజయశాంతి తర్వాత అంతటి ఇమేజ్ తెచ్చుకుందని చెప్పవచ్చు.