ఎప్పుడూ ఫిట్నెస్ మెయింటింగ్ చేసే పవన్ కళ్యాణ్ ఈ మధ్యన రాజీకీయాల్లో పడి కాస్త వళ్ళు చేసాడు. సినిమాలతో, రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ విషయంలో అశ్రద్ధ చేసాడనే చెప్పొచ్చు. అందుకే 'కాటమరాయుడు' సాంగ్స్ లో పవన్ లావుగా ఉన్నాడనే కామెంట్స్ కూడా పడ్డాయి. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కోసం పవన్ లావు తగ్గే ప్రయత్నాలు మొదలు పెట్టాడనే ప్రచారం వుంది. ఫిట్ గా, అందంగా కనబడాలంటే చాలా కష్టపడి వర్కౌట్స్ చెయ్యాలని ఎవరూ పవన్ కి సూచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాలకంటే ముందే పవన్ మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం సంపాదించి ఫిట్ గా వున్నాడు.
ఇక ఇప్పుడు పెరిగిన బరువును పవన్ కళ్యాణ్ బెంగుళూరు వెళ్లి కరిగించుకుంటున్నాడట. మొన్నామధ్యన దాసరి మరణం తో మీడియా ముందుకు వచ్చిన పవన్ ఆతర్వాత మళ్ళీ మీడియాకి చిక్కలేదు. అయితే ఈ గ్యాప్ లో పవన్ బెంగుళూరు వెళ్లి బరువు తగ్గించుకున్నాడట. ఆ విషయం ఇప్పుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలోని ఆన్ లొకేషన్ లోని పిక్ ద్వారా అర్ధమవుతుంది. షూటింగ్ లొకేషన్ లో లీకైన పిక్ ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా స్లిమ్మయ్యాడనిపిస్తుంది. మరి ఎంత కమిట్మెంట్ లేకపోతె పవన్ ఇంత తక్కువ సమయంలో అలా సన్నగా తయారయ్యాడో అని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబై పోతున్నారు.
అంటే మనం త్రివిక్రమ్ సినిమాలో అందంగా స్లిమ్ గా వుండే పవన్ ని చూడబోతున్నామన్నమాట. ప్రస్తుతానికి ఈ లీకైన పవన్ పిక్ ని చూసి మీరు ఎంజాయ్ చెయ్యండి.