నిప్పులేనిదో పొగరాదు అనేది ఎంత నిజమో.. కనీస ఆధారాలు కూడా లేకుండా ఎవ్వరూ తమ మీడియా విలువ తగ్గించుకోవడానికి సిద్దపడి ఏది పడితే అది రాయరు. కానీ చాలా మంది వీక్షకులకు, అభిమానులకు తెలియని నిజం ఏమిటంటే.. ఆ యూనిట్ సభ్యులే చాలాసార్లు పుకార్లలను లీక్ చేస్తారు. ఫలానా చిత్రానికి ఫలానా హీరోయిన్‌ని అనుకుంటున్నారు. ఫలానా సినిమాకు ఫలానా టైటిల్ అంటున్నారు అనే లీక్‌లు పుడతాయి. వాటిని మీడియా రాస్తుంది. కానీ వీక్షకులు, అభిమానుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా, లేదా వారనుకున్న హీరోయిన్లు, టైటిల్ దొరక్క పోయినా కూడా అదే సినీ పెద్దలు మీడియాపై రుసరుసలాడుతారు.
ఇక చిరంజీవి నటించే 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని లాడ్జ్ స్కేల్‌లో, భారీ బడ్జెట్‌తో, పెద్ద కాన్వాస్‌పై 'బాహుబలి'కి ధీటుగా తీయనున్నారని, హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని తెస్తున్నారని ప్రచారం జరిగింది. ఇక ఉయ్యాలవాడ కథ బ్రిటిష్ కాలం నాటిది కావడంతో పలువురు హాలీవుడ్ నటులను, బాలీవుడ్, కోలీవుడ్ నటులను కూడా పెట్టుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇక ఈ చిత్రం కథకు పరుచూరి బ్రదర్స్ కాస్త సినిమాటిక్ టచ్ ఇవ్వనుండటంతో ఇందులో ముగ్గురు హీరోయిన్లని, ఉయ్యాలవాడగా, ఆయన తండ్రిగా కూడా చిరునే ద్విపాత్రాభినయం చేస్తాడని కూడా చెప్పుకున్నారు. లిస్ట్‌లో భాలీవుడ్ హీరో అమితాబ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, సోనాక్షి సిన్హా, విద్యాబాలన్, ప్రియాంకాచోప్రా వంటి వారున్నారని ప్రచారం జరిగింది.
తాజాగా వస్తున్న న్యూస్ ప్రకారం ఇంకా ఈ చిత్రం సబ్జెక్ట్ విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్నారట. 'గౌతమీపుత్ర శాతకర్ణి' లాగానే ఉయ్యాలవాడ చరిత్రపై ఖచ్చితమైన న్యూస్ లేదు. ఇక తాజాగా వస్తున్న వార్తలేమంటే ఐశ్వర్యారాయ్, అమితాబ్, విద్యాబాలన్ లు స్పందించలేదని, ప్రియాంకాచోప్రా హాలీవుడ్ మూవీలలో పడి బాలీవుడ్ అవకాశాలు కూడా వదులుకుంటున్నందు వల్ల ఆమె కూడా నో చెప్పిందట. ఇక సోనాక్షిసిన్హా నటించిన ఓకే ఒక్క దక్షిణాది చిత్రం రజనీ 'లింగా' డిజాస్టర్ తర్వాత ఆమె ఇక దక్షిణాది చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకుందట. దాంతో జేజేమ్మనే సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇక అల్లుఅర్జున్ చేయబోయే 'నా పేరు సూర్య.. నా పేరు ఇండియా' చిత్రంలో కన్నడ 'కిర్రాక్‌పార్టీ' హీరోయిన్ రష్మిక మండన నటిస్తోందని వచ్చిన వార్తలు కూడా తూచ్ అంట...! అందండీ సంగతి....!