శృతిహాసన్.. వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెకు కొత్తకాదు. పిల్లల్ని కనడానికి పెళ్లే చేసుకోవాలా? మరో మార్గం లేదా? అని ప్రశ్నించి, తాను పెళ్లికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వనని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసింది. ఇక ఆమె, ఆమె తండ్రి కమల్ అడుగుజాడల్లోనే నడుస్తూ, తాను సరైన వారసురాలినని నిరూపిస్తోంది. కమల్‌లాగానే తాను కూడా బహుముఖ ప్రజ్ఞాశాలినని, తనలోని నటన, సింగింగ్, మ్యూజిక్.. ఇలా ఒకేసారి పలు పనులు చేసి ఆల్‌రౌండర్ అనిపించుకోవాలనేది తన గోల్‌గా చెబుతోంది. ఒకేసారి పలు పనులు చేయాలని భావించడం వల్ల తమలో దాగివున్న ఇతర ప్రతిభలు కూడా బయటకు వస్తాయని తేల్చిచెప్పింది.
ఇక జీవితం చిన్నదని, దానిని పరిపూర్ణంగా అనుభవించాలని, ఒక్క నిమిషాన్ని కూడా వృధాచేయవద్దంటోంది. దేవుడు ఇచ్చిన జీవితాన్ని పూర్తిగా, అన్ని విషయాలలో (సెక్స్‌లో కూడా) పూర్తిగా ఎంజాయ్ చేయాలని చెప్పుకొచ్చింది. ఓటములు చూసి, ఇతరులను, సమాజంను చూసి భయపడవద్దని అనుకున్నది ఎంత తప్పైనా చేసేయమని మంచి సూక్తులే చెబుతోంది. కాగా ఇటీవల కమల్‌హాసన్, శృతిహాసన్‌లు తాము భోజన ప్రియులమని, అన్ని రకాల వంటలు తింటామని ప్రకటించారు.
ఒక్క మనిషి మాంసం తప్ప కప్ప, పాము, డ్రాగన్, కోతి, పిల్లి.. అన్నింటినీ తింటామని, అవి కొన్నిసార్లు ఇక్కడ దొరకవు కనుక ఎక్కువగా విదేశాలకు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు, అదీ వీలుకాకపోతే ఆ తిండి తినడానికే ఆయా వంటకాలు లభించే దేశాలకు కేవలం తిండికోసమే వెళ్తామని చెప్పి. గోమాంసంను నిషేధించడం తప్పని, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలేదంటూ ఏదేదో మాట్లాడేసింది. శృతి తాజాగా నటించిన 'బెహన్ హోగీ తేరీ', 'కాటమరాయుడు' ఆడకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదని ఆమె సెలవిచ్చింది. మరి ఈమె తన మాటల ద్వారా సభ్య సమాజానికి ఏమి మెసేజ్ ఇచ్చిందో అని అందరూ తలలు పట్టుకుంటున్నారు..! కొందరైతే ఒకడుగు ముందుకేసి..శృతి హాసన్ ని ఎవరికైనా చూపించండి అంటూ కామెంట్స్ కూడా మొదలెట్టారు.