ఒకప్పటి నిర్మాతలలో ఉండే సినిమా మీద ప్రేమ, మమకారం, అన్ని విభాగాలపై పట్టు, కథను జడ్జ్ చేయడం, న్యూటాలెంట్‌ను వెలికితీయడం, ఒక సినిమా ఫ్లాప్ అయినా టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు మరో చాన్స్ ఇవ్వడం వంటివి నేటితరం నిర్మాతలలో దిల్‌రాజుకే దక్కుతాయి. పాతకాలంలో డాక్టర్ రామానాయుడు నుంచి ఎమ్మెస్‌రెడ్డి వంటి వారు ఇలాంటి ప్యాషన్‌తోనే అడుగుపెట్టారు. కానీ నిర్మాతలుగా మారుతున్న కొందరిని చూస్తే కేవలం ఇతర రంగాలలో బాగా సంపాదించి, వాటిని ఎక్కడ దాచుకోవాలి... పెట్టుబడి పెట్టుకోవాలి.. అనేది అర్ధం కాక, కేవలం నల్లదనాన్ని వైట్‌గా మారుస్తూ, సినిమాలలో ఉండే సుఖాలు, ఎంజాయ్‌ల కోసం నిర్మాతలుగా మారుతున్న వారే అధికంగా ఉన్నారు. పలువురు బినామీలుగా, ఫైనాన్షియర్లుగా మారుతున్నారు.
కానీ దిల్‌రాజు కష్టాలను, సుఖాలను, ఫ్లాప్‌లను, హిట్‌లను అన్నింటినీ సమానంగా చూసి ముందుకెళ్తు 25వ సినిమా వరకు రాగలిగాడు. ఇక దిల్‌రాజు భార్య ఆకస్మిక మరణం అందరికీ తెలిసిందే. దాంతో ఆయన అదే దిగులు, డిప్రెషన్‌లో పడి ఆయన మొదలుపెట్టిన చిత్రాలు ఎంతకాలానికి పూర్తవుతాయో? అని చాలామంది భ్రమపడ్డారు. కానీ తన బాధను తన మనసులోనే దాచుకుని ఆయన ఎక్కడా ఆ ఆలస్యం జరగనివ్వలేదు. మనుషులు వితండవాదం చేస్తారు. భార్య చనిపోతే సినిమాలు చేస్తూ భార్యను కూడా నిర్లక్ష్యం చేశాడు అంటారు. అదే భార్య దు:ఖంలో ఉంటే ఈయన సినిమాలను గాలికొదిలేశాడు అంటూ డబుల్ స్టేట్‌మెంట్స్ ఇస్తుంటారు.
కానీ నిజానికి దిల్‌రాజు అంతటి దీర్ఘకాలంగా కలిసి ఉన్న భార్య హఠాన్మరణం చెందినా తన షూటింగ్‌లకు ఏమాత్రం అడ్డంకులు ఎదురుకానివ్వలేదు. తన చిత్రాలలో నటీనటులకు, దర్శకులకు ఏమేమి కావాలో అన్నీ ఆయనే చూసుకున్నాడు. తన బాధను తనలోనే దిగమింగుకుని సినిమాపై ఉన్న ప్రేమ, ఆప్యాయతలతో తొందరగానే కోలుకున్నాడు. ఇదే విషయాన్ని బన్నీ హృద్యంగా చెప్పుకొచ్చాడు. సో.. హ్యాట్సాఫ్ టు దిల్‌రాజు....!