Advertisement
Google Ads BL

'చెప్పను...' కంటే 'అడగద్దు బ్రదర్‌' బెటర్!


అల్లుఅర్జున్‌కి హీరోగా ఫ్లాట్‌ఫాం వేసింది మెగా హీరోలే. బన్నీ తన కెరీర్‌ మొదటి రోజుల్లో డ్యాన్స్‌లో, డైలాగ్‌ డెలివరి వంటి విషయాలలో ఉదాహరణకు 'హ్యాపీ' వంటి చిత్రాలలో పవన్‌ని యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా అనుకరించాడు. ఇక అప్పటివరకు చిరంజీవి, పవన్‌ అభిమానులైన మెగాభిమానులే బన్నీని బాగా ఆదరించారు. డ్యాన్స్‌లలో, ఫైట్స్‌లో చిరు, పవన్‌లనే అనుకరిస్తూ బన్నీ కెరీర్‌ సాగింది. కానీ ఒక్కసారిగా బన్నీ కంటూ ఓన్‌ ఫ్యాన్స్‌ ఏర్పడిన తర్వాత ఆయన తీరే మారిపోయిందని మెగాభిమానులు ఆరోపిస్తుంటారు. తనకంటూ ఓన్‌ ఐడెండిటీ తెచ్చుకోవడంలో తప్పేమి లేకపోయినా బన్నీ ప్రవర్తనలో మాత్రం విపరీతమైన మార్పు వచ్చిందంటారు. ఆ నేపథ్యంలోనే ఆయన పవన్‌ అభిమానులను ఉద్దేశించి చేసిన 'చెప్పను బ్రదర్‌' అనేది పెద్ద వివాదమే అయి ఇప్పటికీ సద్దుమణగలేదు. 

Advertisement
CJ Advs

ఏదో అభిమానులు తమ ఆత్మసంతృప్తి కోసం పవన్‌ను ఉద్దేశించి పలు మెగా వేడుకలలో పవర్‌స్టార్‌.. పవర్‌స్టార్‌ అంటూ కేకలు వేయడం ఆయనకు నచ్చలేదు. కానీ వారి అభిమానాన్ని అర్దం చేసుకుని ఓ రెండు మాటలు పవన్‌ గురించి మాట్లాడితే పోయేదేముందో? అన్నది ఇప్పటికీ ఎవ్వరికీ అర్దం కాని విషయం. నిజమే... పవన్‌ అభిమానులు హద్దులు మీరి, పవర్‌స్టార్‌ పవర్‌స్టార్‌.. అని సందర్భం లేని వ్యాఖ్యలు, అరుపులు చేశారనేది నిజమే. అది ఏ నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్‌లోనో, మరో ఫ్యామిలీ ఫంక్షన్‌లోనో కాదు కదా...! కేవలం తమ మెగా ఫంక్షన్లలో, మెగా హీరోలు వచ్చిన ఈవెంట్స్ లో మాత్రమే అలా గోల చేశారు. ఇక వర్మ 'వంగవీటి' ఫంక్షన్‌లో పవన్‌ ఫ్యాన్స్‌ గోల చేసి, వర్మ తిడితే దానిలో అర్దముంది. కానీ స్వయాన బన్నీని తమ హీరో గురించి రెండు మాటలు మాట్లాడమని మెగాభిమానులు గోల చేయడాన్ని ఇంకా సంతోషంగా తీసుకోవాలి గానీ వారిని హర్ట్‌ చేసేలా 'చెప్పను బ్రదర్‌' అనడం తప్పే. ఇప్పుడు ఆ తప్పు బన్నీ తెలుసుకున్నట్లు ఉన్నాడు. 

దాంతోనే ఆయన తాజాగా 'డిజె'కి ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లు, ప్రమోషన్స్‌లో ముందుగానే 'అడగద్దు బ్రదర్‌' అని జర్నలిస్ట్‌లకు చెప్పేశాడు. ఇక 'డిజె'లోని పాటలో వివాదం వంటివన్నీ అడగద్దన్నాడు. అలా అడిగిన జర్నలిస్ట్‌ల ప్రశ్నలను తెలివిగా దాటవేశాడు. మొత్తానికి 'చెప్పను బ్రదర్‌..' అనే దానికంటే 'అడగద్దు బ్రదర్‌' అనడమే మేలేమో? అయినా అడగద్దు అనేంత తప్పు పవన్‌ ఫ్యాన్స్‌ ఏమి చేశారు? దాంతోనే బన్నీ చిత్రాలకు డిజ్‌లైక్స్‌తో పాటు బన్నీకి కన్నీగా చూపుతూ సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. 

Allu Arjun Mind Set at DJ Promotions:

Allu Arjun Altematem To Media on Pawan Kalyan Name and Duvvada Jagannadham Song Issue. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs