ఇప్పుడు తమిళంలో రాజకీయాలు ఎంత రసవత్తరంగా మారాయో..... సినిమా విషయానికొచ్చేసరికి సుందర్ సి డైరెక్షన్ లో రూపుదిద్దుకోబోయే 'సంఘమిత్ర' ప్రాజెక్ట్ కూడా అంతే రసవత్తరంగా మారింది. ఈ ప్రాజెక్ట్ లో ముందుగా శృతి హాసన్ ని ఫైనల్ చేసిన చిత్ర యూనిట్ దాని కోసం ఆమెకు యుద్ధ విద్యల్లో శిక్షణ కూడా ఇప్పించారు. కానీ అమ్మడుకి అవి రుచించక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అమ్మడు ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యిందో క్లారిటీ ఇచ్చినా కూడా ఏవేవో రూమర్స్ మాత్రం బాగా ప్రచారంలో వున్నాయి.
ఇక ఈ ప్రాజెక్ట్ నుండి శృతి తప్పుకున్నాక 'సంఘమిత్ర' టైటిల్ రోల్ కి చాలామంది హీరోయిన్స్ పేర్లు వినబడ్డాయి. ఆర్య, జయం రవి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సంఘమిత్రగా అనుష్క దాదాపు ఫిక్స్ అయినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ లైన్ లోకి నయనతార వచ్చి చేరింది. సంఘమిత్రలో నటించమని నయనతారని చిత్ర యూనిట్ సంప్రదించిందని అంటున్నారు. అయితే ఈ ఆఫర్ కి నయన్ చాలా కండిషన్స్ పెట్టిందట. ఇప్పటికే తమిళంలో ఫుల్ ఫామ్ లో వున్న హీరోయిన్ గా నయన్ అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటూ నిర్మాతలకు చుక్కలు చూపెడుతుంది.
మరి భారీ ప్రాజెక్ట్ అయిన 'సంఘమిత్ర' కోసం నయన్ భారీ రెమ్యునరేషన్ అడిగినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి ఆ మాత్రం రెమ్యునరేషన్ కావాలని నయన్ చెప్పనట్లు.... ఆ రెమ్యునరేషన్ ఇవ్వడానికి 'సంఘమిత్ర' నిర్మాతలు రెడీ అయినట్లు చెబుతున్నారు. మరి రెమ్యునరేషన్ భారీగా ఇచ్చినా రెండేళ్లు సమయం ఒకే ప్రాజెక్ట్ మీద పెట్టడం నయన్ కి సాధ్యమయ్యే పనేనా...? ఇప్పటికే రెండేళ్ల ఈ ప్రాజెక్ట్ కోసం 'సంఘమిత్ర' నుండి చాలామంది డ్రాప్ అయ్యారనే వార్తలు ఉండే వున్నాయి. చూద్దాం నయన్ అయినా నిలబడుతుందా? లేదా! అనేది.