Advertisement
Google Ads BL

హెబ్బా..కి ఈ హీరో కూడా హ్యాండిచ్చాడు..!


టాలీవుడ్ లో ఎవరైనా హీరోహీరోయిన్స్ రెండు మూడు సినిమాల్లో కలిసి నటించారు అంటే వారి మధ్యన ఏదో ఉందని.... ప్రచారం మొదలవుతుంది. ఇలాంటి రూమర్స్  టాలీవుడ్ హీరోహీరోయిన్స్ కి కొత్తేమి కాదు. ఆనాటి కాలం నుండి వస్తున్నదే ఇది. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ లు హిట్ ఫెయిర్ గా మూడు నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. వీరి మధ్యన కెమిస్ట్రీ  బాగా వర్కౌట్ అవుతుందని దర్శక నిర్మాతలు పదే పదే వారి ఇద్దరినీ జంటగా సినిమాల్లో రిపీట్ చేశారు. కానీ బయట మాత్రం రాజ్ తరుణ్ అండతోనే హెబ్బా టాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు పొందుతుందని...వారి మధ్యన ఎఫ్ఫైర్ ఉందంటూ ప్రచారం హోరెత్తింది. 

Advertisement
CJ Advs

కానీ మా మధ్యన ఏం లేదంటూ హెబ్బా పటేల్ మీడియాకి స్పష్టం చేసింది. మా మధ్యన సంబంధం అంటే అది సినిమా షూటింగ్స్ వరకే అని వ్యక్తిగతంగా మా మధ్యన ఏం లేదని....రెండు మూడు సినిమాల్లో కలిసి నటిస్తే ఇలాంటివి పుట్టించేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక రాజ్ తరుణ్ కూడా మా మధ్య ఏం లేదంటూనే మరో ముప్పై సినిమాలు హెబ్బా తో కలిసి నటించాలనుందని అంటాడు. అయితే వీరిమధ్యన లవ్ ఎఫ్ఫైర్ ఉందని....  కానీ అది బ్రేకప్ అయ్యిందని దానికి కారణం 'ఏంజిల్' హీరో నాగ్ అన్వేష్ అంటూ వార్తలు వచ్చాయి.

'ఏంజిల్' సినిమాతో నాగ్ అన్వేష్ తో హెబ్బా బాగా క్లోజ్ గా ఉంటుందని అందుకే రాజ్ తరుణ్ తో బ్రేకప్ చేసుకుందని అంటున్నారు. అయితే నాగ్ అన్వేష్ మాత్రం అవన్నీ ఒట్టి పుకార్లే అని... సెట్స్ వరకు మాత్రమే హెబ్బా తనకు క్లోజ్ అని.....రాజ్ కి, హెబ్బకి మధ్య  ఏం జరిగిందో నాకు తెలియదని.. తనకి ఎప్పటికి హెబ్బా పటేల్ మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెబుతున్నాడు. మరి హెబ్బా పటేల్ రాజ్ తరుణ్ కి క్లోజా? లేకుంటే నాగ్ అన్వేష్ కి క్లోజా! అసలు వీరి మధ్య నిజంగానే ఏమీ లేదా? లేదా కావాలనే మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నారా? ఏమో వారి అంతరాత్మ కే తెలియాలి. 

Nag Anvesh reacts on affair with Hebbah:

Freshly, Nag Anvesh has rubbed off all these rumors telling that he is close to Hebbah only on sets and that he doesn’t know anything happened between her and Raj Tarun.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs