సాధారణంగా ముందుగా బ్యూటీలుగా ఎంపికైన తర్వాత సినిమాలలో అవకాశాలొస్తుంటాయి. కానీ విచిత్రంగా సిమ్రన్ చౌదరి మాత్రం సినిమాలో నటించిన తర్వాత మిస్ ఇండియా పోటీలకు వెళ్లి హాట్‌టాపిక్‌గా మారింది. ఈమె ఇటీవల జనవరిలో మిస్ తెలంగాణ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచింది. ఈమె 'హమ్‌తుమ్' చిత్రంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె మిస్ ఇండియా పోటీలలో పాల్గొంటోంది.
ఇప్పటికే ఈ పోటీలలో ఆమె ఫైనల్స్ వరకు చేరుకుంది. ఈ నెల 25న రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్‌లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఆమె 29 మందితో పోటీపడుతోంది. ఇక ఈమె మిస్ ఇండియాగా ఎంపికకావడం లాంఛనమేనని, ఆమె ప్రతిభ, అందం, తెలివితేటలు చూసినవారు అంటున్నారు. మిస్ ఇండియాగా ఎంపికైన వారిని మిస్ వరల్డ్‌కు పంపిస్తారు కనుక మిస్ వరల్డ్ అయ్యేంత వరకు విశ్రమించేది లేదని ఈ భామ అంటోంది.
మొత్తానికి మన తెలుగమ్మాయి ఆ స్థాయికి ఎదిగితే అందరికీ సంతోషమే. మరోపక్క ఈమెను ఇప్పటికైనా తమ తమ చిత్రాలలో ముందుగా బుక్ చేసుకుని, అడ్వాన్స్ ఇవ్వాలని టాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోలు అనుకుంటున్నా కూడా ఈమె దీపికాపడుకొనే తరహాలో వెళ్లాలనే నియమం పెట్టుకుందట. కర్ణాటకకు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్‌పడుకొనేకి కెరీర్ ప్రారంభంలోనే కన్నడ చిత్రాలలో అవకాశం వచ్చినా ఆమె నటించలేదు.
ఏకంగా బాలీవుడ్‌లో రాణించి అప్పుడు రజినీ సరసన 'కొచ్చాడయాన్' చిత్రంలో కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని నటించింది. ఇక సిమ్రాన్ చౌదరి కూడా ముందుగా తెలుగులో నటిస్తే తెలుగమ్మాయి అనే చిన్నచూపుతో ఆమెను బిగ్రేడ్ హీరోయిన్ కింద లెక్కేస్తారు. అదే బాలీవుడ్‌కి క్లిక్ అయితే ఆ తర్వాత మనోళ్లే ఏరికోరి కోట్లు ఇచ్చుకుంటారు. ఈ కిటికు ఈ అమ్మాయికి బాగా తెలిసినట్లే ఉంది.