నిన్నటిదాకా ఆది అంటే ఎవరు అంటే ఠక్కున సాయికుమార్ తనయుడు అని చెప్పేవారు. కానీ నేడు రవిరాజా పినిశెట్టి కుమారుడు తమిళం నుండి తెలుగులో కూడా విలన్ పాత్రలు చేస్తుండటంతో హీరో ఆదిని ఆది సాయికుమార్ అని పిలవాల్సివస్తోంది. కాగా ఈ కుర్రహీరోకి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్నా సరైన హిట్ మాత్రం పడటం లేదు.
ప్రస్తుతం ఆయన నారారోహిత్, సందీప్‌కిషన్, సుధీర్‌బాబులతో కలిసి నటిస్తున్న మూవీ 'శమంతకమణి'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఇప్పుడు ఆదికి హీరోగా మంచి బ్రేక్ వచ్చే చాన్స్ వచ్చిందంటున్నారు. గీతాఆర్ట్స్, బన్నీవాసు, యువి క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించే చిత్రం అంటే దానికి హిట్ అయ్యే లక్షణాలే ఎక్కువగా ఉంటాయి. వీరు కలిస్తే ఏదైనా సంచలనమేనని చెప్పాలి.
ఈ సమయంలో ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇక టైటిల్స్ అంటే ఏదైనా హిట్ సాంగ్‌లోని క్యాచీ పదాలను టైటిల్స్‌గా పెట్టుకోవడం సాధారణంగా జరుగుతోంది. దాంతో ఇటీవలే నాని నటించిన సూపర్‌హిట్ చిత్రం 'నేనులోకల్'లోని 'నెక్ట్స్‌ఏంటి..' అనే పాట బాగా పాపులర్ అయింది.
ఈ పదాన్నే ఆది సినిమాకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇది ఓ తమిళ థ్రిల్లర్ కామెడీకి రీమేక్‌గా రానుండగా, సాయికుమార్‌తో పాటు రష్మీ అందాలు కూడా ఈ చిత్రానికి ప్లస్ కానున్నాయి.