Advertisement
Google Ads BL

భూమిక ఇప్పటికైనా తప్పు తెలుసుకుందా!


భూమిక చావ్లా... ఈ భామ నాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను కొంతకాలం ఓ ఊపుఊపింది. సుమంత్‌ హీరోగా నటించిన 'యువకుడు' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక 'ఖుషీ, సింహాద్రి, ఒక్కడు' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో ఆకట్టుకుంది. యువ స్టార్స్‌ అందరితో బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చింది. అదే సమయంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వంటి సీనియర్స్‌తో కూడా కలిసి నటించింది. అలా టాలీవుడ్‌లో ఆమె ఓ వెలుగు వెలిగింది. 

Advertisement
CJ Advs

నాడు స్టార్‌ హీరోల ఫస్ట్‌ చాయిస్‌, ఓటు ఆమెకే. ఇక హిందీలో సల్మాన్‌ఖాన్‌ వంటి స్టార్‌తో కూడా జత కట్టింది. తెలుగులో 'మిస్సమ్మ, అనసూయ' వంటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో తన సత్తా చాటింది. ఆ తర్వాత యోగా మాస్టర్‌ భరత్‌ఠాకూర్‌ని వివాహం చేసుకుంది. అదే సమయంలో నిర్మాతగా మారి ఈ జంట తప్పు చేసింది. 'తకిట.. తకిట' వంటి డిజాస్టర్‌ మూవీస్‌ని నిర్మించింది. 

ఇక పత్రికారంగం అంటేనే పెద్ద ఊబి. దాసరి వంటి మహామహులే 'ఉదయం' వంటి దినపత్రికలనే కాదు... 'శివరంజని, మేఘసందేశం' వంటి సినీ వీక్లీలను కూడా నడపలేక ఇబ్బందులు పడ్డారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వంటి నాటి అధికార పార్టీ ఎంపీనే 'ఈ వారం' అనే వారపత్రికను నడపలేకపోయాడు. ఇవ్వన్నీ పట్టించుకోకుండా ఆమె ఫిల్మ్‌ మేగజైన్‌ను కూడా స్థాపించింది.

పరిశ్రమలో మంచి మంచి పరిచయాలు ఉండటం, సాటి కోస్టార్‌ కావడంతో ఆమె సినీ పత్రికా రంగంలో విజయం సాధిస్తుందనే చాలా మంది భావించారు. దాన్ని మూసివేసింది. ఆ తర్వాత కొన్ని వ్యాపారాలు చేసింది. సంపాదించినది మొత్తం పొగొట్టుకున్నదని సమాచారం.దీంతో మళ్లీ ఆమె సినీ ఇండస్ట్రీ లో కి రీ ఎంట్రీ ఇవ్వక తప్పలేదు.

రీ ఎంట్రీ లో 'లడ్డూబాబు' ఎం.ఎస్. ధోని వంటి చిత్రాల్లో చేసిన ఈమె.. ఇప్పుడు నాని హీరోగా వేణుశ్రీరాం దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్త్ను 'ఎంసీఏ' (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌) లో సపోర్టింగ్‌ రోల్‌కు ఒప్పుకుంది. డిగ్నిఫైడ్‌గా ఉండే ఏ పాత్రనైనా చేస్తానంటోంది. తనలాంటి పలువురు సీనియర్లను చూసి కూడా భూమికచావ్లా ఏమీ నేర్చుకోలేదనే చెప్పాలి. 

Bhumika Chawla in Nani Movie MCA:

Bhumika Chawla to make a comeback with Nani starrer MCA
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs