Advertisement
Google Ads BL

లేటైనా బాగా వర్కౌట్‌ చేస్తున్నారు...!


అశ్వనీదత్‌ కుమార్తెలు నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో సావిత్రి బయోపిక్‌గా 'మహానటి'ని తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. బయోపిక్‌ అంటే సామాన్యం కాదు.. ఎంతో పరిశోధన, పరిశీలన చేయాలి. అవ్వన్నీ డైరెక్టర్‌ పూర్తి చేసి స్క్రిప్ట్‌ను లాక్‌ చేశాడు. సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ని ఎంచుకుని సెహభాష్‌ అనిపించాడు. ఇక ఓ కీరోల్‌ను సమంత పోషించనుంది. వివాదాస్పదమైన జెమినీ గణేషన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ ఎంచుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఎందుకంటే అంత వివాదాస్పదమైన పాత్రను చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. ఇక తాజాగా మహానటుడు ఎస్వీరంగారావుగా ఏ పాత్రనైనా పోషించగల సమర్ధత ఉన్నవెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ ప్రకాష్‌ రాజ్‌ను ఫైనల్‌ చేశాడు. సావిత్రి కెరీర్‌లో ఐదు పాత్రలు చాలా ముఖ్యమైనవి. అవి జెమిని గణేషన్‌, ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్‌, నాగేశ్వర రావు, జమున. కాబట్టి వీరి పాత్రలను దర్శకుడు ఎలా మలుస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మిగిలివుంది ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, జమున పాత్రలు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీలలో కూడా విడుదల చేయనున్నారు. 

Savitri Biopic Film Mahananti:

The daughters of Ashwini Dutt are directing the movie 'Mahanati' to be Savitri Biopic in the direction of Nagaswini. All of them were completed by the director and locked the script. Choice of Savitri was chosen by Keerthy Suresh.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs