Advertisement
Google Ads BL

తనదైన ట్రేడ్‌మార్క్‌ ఫైట్‌ చేస్తోన్న పవన్‌..!


పవన్‌ తన కెరీర్‌ మొదట్లో పాపులర్‌ అయింది ఫైట్స్‌ ద్వారానే. 'అక్కడ అమ్మాయి -ఇక్కడ అబ్బాయి'లో కారు టైర్ల కింద చేతులు పెట్టే రియల్‌ఫైట్స్‌ నుంచి బద్రి, ఖుషీ, తమ్ముడులో కిక్‌ బాక్సింగ్‌.. ఇలా ఆయన నటించే ప్రతి చిత్రంలో ఆయన స్టైల్‌ ఫైట్‌ ఖచ్చితంగా ఉంటుంది. రియల్‌లైఫ్‌లో కూడా మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం వల్ల ఆయన కొన్ని ఫైట్స్‌కి సొంతగా ఫైట్స్‌కంపోజ్‌ చేశాడు. 

Advertisement
CJ Advs

కానీ అవి అన్నీ ఎంతో రియలిస్టిక్‌గా, ఎగిరెగిరి తన్నడాలు, హీరోలు గాలిలోకి లేచే విధంగా ఉండవు. నేచురల్‌గా ఉంటాయి. ఈ విధంగా ఫైట్స్‌ విషయంలో ఆయన ఓ ట్రెండడ్‌ మేకర్‌ అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. ఇక ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో తయారవుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి నాటికైనా విడుదల చేయాలని భావిస్తున్నఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటి వరకు ఎక్కువగా రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. 

ప్రస్తుతం సారధి స్టూడియోస్‌లో ఓ స్లైలిష్‌ ఇరానీ కేఫ్‌ సెట్‌ను వేసి పవన్‌ స్టైల్‌లో ఓ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా, ఖుష్బూ, ఇంద్రజ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక మొదటి సారిగా తెలుగు చిత్రంలోకి సంగీత సంచలనం అనిరుద్‌ ఎంటర్‌ అవుతున్నాడు. ఇప్పటికే '3'లోని కొలవరి..కొలరవిని మించిన పాటగా 'వివేగం'లో సూరియా అందించిన పాట రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. సో.. ఫ్యాన్స్‌ త్రివిక్రమ్‌ దేవిశ్రీని కాకుండా అనిరుద్‌ని ఎందుకు పెట్టుకున్నాడో ఇప్పుడు అర్ధమవుతోంది. 

Pawan to Make His Trademark Fight:

Pawan kalyan is also fights for some fights because he has learned martial arts in real life. He is currently busy with the big budget of producer by Radhakrishna directed by Trivikram Srinivas's 'Harika & Hasini Creations' banner.  At present, a Slovish Irani cafe set in Saradi Studios is being filmed in Pawan's style fight.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs