Advertisement
Google Ads BL

నాని భలే వారిని పట్టుకున్నాడు..!


వాస్తవానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం నేచురల్‌ స్టార్‌ నాని హవా నడుస్తోంది. కేవలం 10నుంచి15 కోట్లలో నాని సినిమా తీస్తే మినిమిం 30 నుంచి 35కోట్లు సాధించే రేంజ్‌ ఆయనలో కనిపిస్తోంది. ఇప్పటికే 'నిన్నుకోరి' అనే చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం పాటలు, డైలాగ్స్‌ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇదో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. జులై 7న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

Advertisement
CJ Advs

ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత దానయ్య నిర్మిస్తుండగా, శివ నిర్వాణ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. దర్శకులుగా కొత్తవారికి చాన్స్‌ ఇస్తోన్న నాని నిర్మాతల పరంగా మాత్రం దానయ్య, దిల్‌రాజు వంటి వారిని ఆకట్టుకుంటున్నాడు. 'నిన్నుకోరి' విడుదలకు సిద్దమైపోతున్న సమయంలో ఆయన తదుపరి చిత్రం వేగం అందుకుంది. నానికి 'నేను లోకల్‌'తో ఏకంగా 35కోట్ల మార్కెట్‌ వద్ద నిలబెట్టిన దిల్‌రాజు ఈ సారి వేణుశ్రీరాం దర్శకత్వంలో నానితో 'ఎంసీఏ' ( మంచి లక్షణాలున్నఅబ్బాయ) చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని టైప్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సాంగ్స్‌ అన్ని ఉన్నప్పటికీ ఈ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఎక్కువగా ఉండే డ్రామాగా నడవనుంది. 

దానికి తగ్గట్టుగానే ఈ చిత్రంలో సీనియర్‌ హీరోయిన్లైన భూమిక చావ్లా, ఆమని నటిస్తున్నారు. భూమిక ఎందరితోనో స్టార్స్‌తో పనిచేసినప్పటికీ పెళ్లైన తర్వాత ఆమె సినిమా రంగంలో, పత్రికారంగంలోకి దిగిదెబ్బతింది. గతేడాది వచ్చిన 'ఎం.ఎస్‌.ధోని' చిత్రంలో హీరోకి అక్కగా నటించింది. ఇక ఆమని ఆంటే 'శుభలగ్నం నుంచి శుభసంకల్పం' వరకు గుర్తుకు వస్తాయి. 

ముఖ్యంగా ఆమె రీఎంట్రీ ఇచ్చిన 'ఆ..నలుగురు'లో రాజేంద్రప్రసాద్‌కి ధీటుగా నటించింది. ఈ రెండు పాత్రలు హీరో హీరోయిన్లతో సంబంధం ఉండే పాత్రలని, వారు అక్కలుగా, లేదా వదినలుగా నటిస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రానికి నాని ,దిల్‌రాజు, అనుపమ పరమేశ్వరన్‌లతో పాటు భూమిక, ఆమని కూడా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

Nani Next Movie 'MCA':

The natural star Nani Hawa is currently running, even though he does not agree with the fact. It's already getting ready to release 'Ninnu Kori'. The film is going to be released on July 7th. Dil raju is doing this film Venu Sriram's direction with Nani with 'MCA'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs