Advertisement
Google Ads BL

అబ్బా.. యంగ్‌టైగర్‌ ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాడు..!


జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఆ మధ్య వరుస చిత్రాల పరాజయంలో ఇక అతని పనైపోయిందనే విమర్శలు వచ్చాయి. రొటీన్‌ నటన, డైలాగ్‌లు, విపరీతమైన నానా భీభత్సకరమైన ఫైట్స్‌తో, దర్శకుల ఎంపిక నుంచి అన్నీంటిలో పాత చింతకాయపచ్చడిలా అనిపించాడు. ఈ ధోరణి మార్చుకోకపోతే, ఇలా హిట్‌ దర్శకుల వెంట పడకుండా ఉంటే ఎన్టీఆర్‌ కెరీర్‌ బాగుపడుతుందని, తనకున్న మాస్‌ ఇమేజ్‌ దృష్ట్యా అదో ధోరణిలో సాగితే కష్టమని అందరూ భావించారు. 

Advertisement
CJ Advs

కానీ ఒక్కసారి స్ట్రాంగ్ బేస్‌ ఏర్పాటు చేసుకుని, స్టార్‌ హోదా దక్కించుకున్న తర్వాత వరుసగా ఐదారు ఫ్లాప్‌లిచ్చినా ఏడో సినిమా హిట్‌ ఇస్తే చాలు అతని ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగిపోతారని, ఆ ఖుషీయే వేరని, తిరిగి తమ పూర్వవైభవం సాధిస్తారని పలువురు స్టార్స్‌ విషయంలో కూడా ఎప్పుడూ ప్రూవ్‌ అవుతూనే ఉంది. ఇక ఏక్షణాన పూరీజగన్నాథ్‌ ఎన్టీఆర్‌తో ఏక్షణాన కాస్త నెగటివ్‌టచ్‌ ఉన్న 'టెంపర్‌' చిత్రం చేయడంతో ఆయన జాతకం మరలా మారింది. 

'నాన్నకు ప్రేమతో' చిత్రంతో హిట్‌ కొట్టాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని, క్లాస్‌ ఆడియన్స్‌ని, ఓవర్‌సీస్‌ని ఆకట్టుకున్నాడు. ఇక 'జనతా గ్యారేజ్‌'తో కెరీర్‌లో పెద్ద హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఇక అవార్డుల విషయంలో కూడా జూనియర్‌ ఇరగదీస్తున్నాడు. తనకొడుకు అభయ్‌రాన పుట్టినప్పటి నుంచి అన్నీ కలిసే వస్తున్నాయి. సినిమా అవార్డ్స్‌లో బెస్ట్‌ హీరోగా 'టెంపర్‌' చిత్రానికి ఎన్టీఆర్‌  అవార్డు అందుకున్నాడు. ఐఫా, సైమాలో 'జనతా గ్యారేజీ'కి అవార్డులు పొందాడు. ప్రస్తుతం జనతా గ్యారేజ్‌కి గాను జియో ఫిలింఫేర్‌ అవార్డ్‌ను 'జనతా గ్యారేజ్‌'కి రీసెంట్‌గా అందుకున్నాడు. ఈ అవార్డు ఆయనకు రెండోది. గతంలో అంటే 10ఏళ్ల ముందు 'యమదొంగ' చిత్రానికి గాను ఆయనకు ఈ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. 

NTR Turns Best Actor at Filmfare Awards 2017:

It was a star studded glittering event on Saturday the 64th Filmfare Awards, 2017 were given away to the best performers of 2016 at HICC, Hyderabad. Young Tiger NTR . Best Actor (Male): Jr NTR. He is currently gifting the Geo Filmfare Award for Janata Garage for 'Janata Garage'. This award is the second time.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs