నారా రోహిత్‌కి పొలిటికల్, సినీ బ్యాగ్రౌండ్‌లున్నా కూడా 'బాణం' నుంచి అన్ని చిత్రాలలో విభిన్నంగానే కనిపిస్తూ, కంటెంట్ విషయంలో కూడా కొత్తదనం చూపిస్తూనే ఉన్నాడు. 'ప్రతినిధి'తో పాటు 'అప్పట్లో ఒకడుండేవాడు, జోఅచ్చుతానంద' చిత్రాలు మంచి పేరును కూడా తీసుకుని వచ్చి కమర్షియల్‌గా కూడా ఓకే అనిపించాయి. ఇక ప్రస్తుతం ఆయన శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో 'నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయి కుమార్'లు నటించిన 'శమంతకమణి' ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటూ అసలు 'శమంతకమణి' ఎవరు? అనే క్యూరియాసిటీని కల్పించడంలో సక్సెస్ అవుతుంది.
ఇక ఇదే సమయంలో ఆయన నటించిన 'కథలో రాజకుమారి' కూడా ఫస్ట్‌లుక్, టీజర్లతో బాగా స్పందనని రాబట్టుకుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిలే మంచి పొయిటిక్ టచ్‌తో ఉంది. మరోపక్క సంగీతం, నారా రోహిత్ స్క్రీన్ ప్రెజెన్స్, అందమైన విజువల్స్, ఆలోచన రేక్కెత్తించే డైలాగ్స్ బాగున్నాయి, నమితా ప్రమోద్ కూడా బాగానే ఉంది. ఈ చిత్రాన్ని నారా రోహితే తన స్నేహితులతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
మొత్తానికి ఈ చిత్రం ట్రైలర్ డిఫరెంట్‌గా ఉంది. అంటే ఈసారి కూడా నారా రోహిత్ తక్కువ వ్యవధిలోనే రెండు డిఫరెంట్ మూవీస్‌లో కనిపించనున్నాడన్నమాట...!