నిజానికి తెలుగు వారు అందరినీ కాకపోయినా టాలెంట్ ఉన్న తెలుగువారిని కూడా సరిగా ప్రోత్సహించరు. వారి ప్రతిభను గుర్తించరు. ఒకప్పుడు కోట శ్రీనివాస రావు విషయంలో అదే జరిగింది. ఇప్పుడు రావు రమేష్ విషయంలోనూ అదే జరుగుతోంది. 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో తెలుగువాడు కాకపోయినా రాజ్ కుమార్‌ని తీసేసి ప్రకాష్‌రాజ్‌ను తీసుకున్న విషయం వివాదమై మర్చిపోక ముందే చరణ్ సినిమానే అయిన సుకుమార్ 'రంగస్థలం'లో రావురమేష్‌ని తీసేసి మరలా ప్రకాష్‌రాజ్‌నే తీసుకున్నారు. రాజ్‌కిరణ్ తమిళం వాడు కాబట్టి దీనిని కాస్త ఆలస్యంగానైనా వివాదం చేశాడు.
కానీ రావురమేష్ పరిస్థితి అదికాదు.. ఆయన చావైనా బతుకైనా తెలుగే. ఇప్పటికే ఆయన అలిసిసొలసిపోయాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు. ఇక రావు రమేష్ రావుగోపాలరావు తనయుడే అయినా ఎప్పుడు ఆయన పేరు వాడుకోలేదు. నిర్మాతగా ఓ పెద్ద చిత్రం నిర్మించబోయి సినిమా ప్రారంభం కాకముందే మోసపోయాడు. తర్వాత బుల్లితెరపై కనిపించాడు. ఇక 'గమ్యం, కొత్త బంగారులోకం' చిత్రాలు ఆయనకు జన్మనిచ్చాయి.
ఒక విధంగా ఆయనకు నటునిగా జన్మనిచ్చి ప్రోత్సహించింది దిల్‌రాజే. కాబట్టే ప్రస్తుతం ఆయన బన్నీతో నిర్మిస్తున్న 'డిజె'లో కీలకమైన పాత్ర ఇచ్చాడు. ఇక ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎంత బాగా పండించగలడో అందరికీ తెలుసు. దాంతోనే ఆయన ఈవివికి పెద్ద ఫేవరేట్ అయ్యాడు. 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రంలో రావుగోపాలరావు పోషించిన రంభ తండ్రి పాత్ర 'రొయ్యల నాయుడు' పాత్ర ఎవ్వరికైనా కలకాలం గుర్తుండిపోతుంది.
నిక్కరుతో కోటీశ్వరుడిగా గోపాలరావు చేసిన మెస్మరైజ్ సామాన్యం కాదు. కాగా హరీష్ శంకర్ 'డిజె'లో రావురమేష్‌కి అదే పాత్ర పేరు అంటే రొయ్యలనాయుడుగా అద్భుతంగా చూపించి అతనికి బ్రేక్ ఇవ్వనున్నాడట. పోనీ.. రావు రమేష్‌కి ఈ పాత్ర అయినా స్టార్ రేంజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హోదాని ఇస్తే అంతకంటే ఏమికావాలి..!