Advertisement
Google Ads BL

ఇంకా నాగ్‌పై రూమర్లేనా...?


నాగార్జున గత కొంతకాలంగా తన తనయుల వ్యక్తిగత, కెరీర్‌ అంశాలపై దృష్టిపెట్టాడు. అందుకు అనుగుణంగానే ఆయన తన పెద్ద కుమారుడు నాగ చైతన్యకు, సమంతకు అక్టోబర్‌ 6 నపెళ్లి కోసం పనులు మొదలుపెట్టేశాడు. మరోవైపు తాజాగా నాగ చైతన్యకు కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో 'రారండోయ్‌ వేడుక చూద్దాం' వంటి కూల్‌ అండ్‌ చైతూ కెరీర్‌లో పెద్ద హిట్‌నిచ్చాడు. తన రెండో కొడుకు అఖిల్‌ నటిస్తున్న రెండో చిత్రం షూటింగ్‌లోని పలు యాక్షన్‌ సన్నివేశాలను ఇప్పటికే భారీఎత్తున చిత్రీకరించాడు. 

Advertisement
CJ Advs

ఇక హైదరాబాద్‌ మెట్రో ప్రారంభం కాకుముందే అక్కడ షూటింగ్‌ జరుపుకున్న తొలి చిత్రంగా ఇది రికార్డుక్రియేట్‌ చేసింది. మరోపక్క ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు నటించనుందని, ఆమెతో పాటు మేఘా ఆకాష్‌, అలియాభట్‌ వంటి వారి పేర్లు వినిపించాయి. వీటిని నాగ్‌ ఖండించాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎంపిక ఎప్పుడో పూర్తై షూటింగ్‌ కూడా జరిగిందని సమాచారం. 

అయితే హీరోయిన్‌ పేరును బయటకు రాకుండా సీక్రెట్‌గా ఉంచుతున్నారు. సరైన సమయంలో ఆమెను రివీల్‌ చేసి ఆశ్చర్యపరచనున్నారు. ఇక నాగ చైతన్య కోసం నాగ్‌ బోయపాటి శ్రీనుని ఒప్పించాడని, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ విడుదల కాగానే ఈ చిత్రం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రం తర్వాత బోయపాటి అల్లు అరవింద్‌ నిర్మాణంలో చిరంజీవితో సినిమా చేయనున్నాడు. కాబట్టి ఈ వార్త కూడా కేవలం గాలి వార్తగానే తేలిపోతోంది. 

Rumors Continues on Nagarjuna Akkineni:

Nagarjuna has long looked at his personal and career aspects.  In accordance with that, he started working for his eldest son Naga Chaitanya and Samantha's marriage on October 6th. Naga Boyapati convinced Naga Chaitanya to convince Srinu that the film will be released when Bellamkonda Sai Srisinivas is released.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs