Advertisement
Google Ads BL

దేవుడు శాసించాడు..రజిని పాటిస్తున్నాడు!


ఈ మధ్య కాలంలో  ఏడాదికో రెండేళ్లకో సినిమా తో అభిమానులను పలకరిస్తున్న రజినీకాంత్ ఇప్పుడు మాత్రం  ఏడాదికి రెండు సినిమాలను చేసేస్తూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నాడు. అసలెందుకు ఇంత ఫాస్టుగా రజిని సినిమాలు చేస్తున్నాడో ఇప్పుడు చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఇప్పటికే 'రోబో 2 .0' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేసిన రజిని ఇప్పుడు రంజిత్ పా డైరెక్షన్ లో 'కాలా' చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇప్పటికే ముంబై వీధుల్లో 'కాలా' మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ కోసం చెన్నై కూడా వచ్చేసాడు. ఇక 'రోబో 2 .0' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు డైరెక్టర్ శంకర్ అండ్ టీమ్.

Advertisement
CJ Advs

మరి గ్రాఫిక్స్ ఇందులో అత్యంత కీలకం కాబట్టి సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో గ్రాఫిక్స్ ఉండేలా శ్రద్ద తీసుకుంటున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇపుడు రజిని చేస్తున్న 'కాలా' చిత్రం ఈ ఏడాది చివరికల్లా పూర్తి కానుందట. తాజాగా రజినీకాంత్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అతి త్వరలో ఆ సినిమా ప్రారంభోత్సవం జరగబోతోందట. మరి ఒకేసారి ఇన్ని సినిమా షూటింగ్ లతో తలైవా యమా జోరు మెయింటింగ్ చేస్తూ కుర్రాడిలా మారిపోయాడు. అయితే రజిని ఇలా షూటింగ్ ని పరుగులు పెట్టించడానికి కారణం రజిని పొలిటికల్ ఎంట్రీనే.

రజినీకాంత్ ఈ డిసెంబర్ లోనే కొత్త పార్టీ ప్రకటించబోతున్నాడు. అందువల్లే ఈలోపు వీలైనంతగా సినిమాలు కంప్లీట్ చేసేసి 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో ఎన్నికలకు ప్రిపేర్ చెయ్యడానికి రజిని ప్రయత్నాలు మొదలు పెట్టాడు కాబట్టే సినిమాల్లో ఇంతటి స్పీడుని   ప్రదర్శిస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి రజిని పొలిటికల్ ఎంట్రీని దేవుడు శాసిస్తున్నాడన్నమాట.

Rajinikanth political announcement on Dec 12:

Ever since 1996 when Rajinikanth first hinted that he will be coming into politics if God wills to, is gaining the publicity momentum again.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs