Advertisement
Google Ads BL

'డిజె' పైనే మొదటి దెబ్బ...!


కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టి ద్వారా దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ఈనెల 1వతేదీ నుంచి అమలులోకి తెచ్చింది. దీనిద్వారా ట్యాక్స్‌లు పెరగనున్నాయి. 100రూపాయలలోపు టిక్కెట్లలో పెంచిన దానిని కేంద్రం మరలా తగ్గించి 18శాతానికే పరిమితం చేసింది. 100పై బడిన టిక్కెట్లపై మాత్రం28శాతం పన్ను తప్పదు. తద్వారా జీఎస్‌టి అమలు తర్వాత తొలిదెబ్బ పడుతున్న మొదటి చిత్రం 'డిజె' కావడం విశేషం. దీంతో బయ్యర్లు కట్టే పన్ను శాతం పెరగనుండటంతో లాభాలు పాతస్థాయిలో వస్తాయా? లేదా? అనేది చర్చనీయాంశం అయింది. 

Advertisement
CJ Advs

ఇక నేడు ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్‌ల జోరు సాగుతోంది. ఈ స్క్రీన్లలో ఎక్కువగా 100పై టిక్కెట్లే ఉంటాయి. మరి దీని వల్ల థియేటర్లలోని రేట్లను మాగ్జిమమ్‌ 100కి తగ్గించే ప్రయత్నం చేస్తే పన్ను నుంచి తక్కువతో తప్పించుకోవచ్చనే వాదన వస్తుంటే కాదు.. సినిమాలలో పెరిగిన పన్నులకు తగ్గట్లు టిక్కెట్ల రేట్లను కూడా పెంచుతారనే వాదన మరోపక్క వినిపిస్తోంది. ఇక చివరిక్షణం వరకు హడావుడి పడకుండా ఈ మధ్య పెద్ద నిర్మాతలు కూడా తమ చిత్రాల సెన్సార్‌ పనులను వారం ముందే కానిచ్చేస్తున్నారు. ఇక స్టార్‌ హీరోలు, అందునా 'సరైనోడు'లో రక్తపాతం సృష్టించిన బన్నీ తదుపరి చిత్రం కావడంతో సినిమా ఎంత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినా రక్తపాతం మామూలే. ఇక పూజాహెగ్డేని పోస్టర్లలో చూస్తేనే ఆమె ప్రదర్శన ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోంది. 

ఈ చిత్రంలోని కొన్ని అభ్యంతరకర డైలాగ్‌లను మ్యూట్‌ చేయాలని సెన్సార్‌ ఆదేశించిందని సమాచారం. ఇక ఈ చిత్రం ఫస్ట్‌హాఫ్‌ 1గంట 23 నిమిషాలు, సెకండ్‌పార్ట్‌ 1గంట 12 నిమిషాలు మొత్తం కలిపి 2గంటల 40నిమిషాలలోపే ఉండేట్టు చూసుకున్నారు. ఫస్ట్‌హాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లవ్‌తో సాగగా, సెకండాఫ్‌ ఎమోషన్స్‌, యాక్షన్స్‌తో నిండి ఉందని సెన్సార్‌ రిపోర్ట్‌. ఈ చిత్రానికి సెన్సార్‌ యు/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

GST Faced First Film is Duvvada Jagannadham:

Allu Arjun Duvvada Jagannadham is the First GST Faced Film. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs