Advertisement
Google Ads BL

మరోసారి మహేష్.. భార్యనే నమ్ముకుంటున్నాడా!


ప్రస్తుతం మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'స్పైడర్‌' చిత్రం వేగంగా పూర్తవుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ అవుతుందంటున్నారు. చిత్రంలో సైంటిఫిక్‌ స్పైడర్‌ కనిపిస్తుండటంతో ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌ వంటివి ఎంత అవసరమో తెలుస్తోంది. టీజర్‌కు ముందు ఈ చిత్రం ఇంత లేటా అన్నవారికి సమాధానంగా ఇందులోని సీన్స్‌ కనిపిస్తున్నాయి. ఇక ఈ టీజర్‌ రాజమౌళితో పాటు పలువురు విశ్లేషకులు, తెలివైన ఏ క్లాస్‌ ఆడియన్స్‌ని అలరించినప్పటికీ సగటు మహేష్‌ అభిమానికి మాత్రం అసంతృప్తి పరిచింది. దీంతో మహేష్‌ బర్త్‌డే కానుకగా మహేష్‌ డైలాగ్స్‌తో పాటు మాస్‌ ప్రేక్షకులను అలరించేందుకు మరో టీజర్‌ని కత్తిరించే పనిలో మురుగదాస్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్‌ ఒరిజినల్‌ గెటప్‌ వంటివి రివీల్‌ అవుతాయి. 

Advertisement
CJ Advs

మరోవైపు ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందుతోంది. తమిళంలో ఈ చిత్రం రైట్స్‌ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. దీనిలో ఓ పాత్రలో నమిత కనిపిస్తుందని ఒకప్పుడు వచ్చిన వార్తలే ఇప్పుడు కూడా వినినిస్తున్నాయి. ఇక 'బాహుబలి'తో తెలుగు మార్కెట్‌ భారీ స్థాయిలో పెరిగింది. దీనిని 'స్పైడ్‌ర్‌'కి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'బాహుబలి' ని కరణ్‌జోహార్‌ తీసుకున్నాడు. అదే చిత్రానికి ప్లస్‌ పాయింట్‌. కాగా 'స్పైడ్‌ర్‌' హిందీలో కూడా విడుదలవుతుందనే వార్తలు వస్తున్నా.. యూనిట్‌ ఆ దిశగా ఇప్పటివరకు అసలు ప్రయత్నాలే చేయలేదు. అయితే మురుగదాస్‌కి బాలీవుడ్‌లో మంచి పేరుంది. 

దీనికి తగ్గట్టుగా ఉత్తరాది వారికి సుపరిచితమైన నమ్రతాశిరోద్కర్‌ తన పలుకుబడిని ఉపయోగించి, 'స్పైడ్‌ర్‌' డబ్బింగ్‌ హక్కులను మంచి పేరున్ననిర్మాణ సంస్థకు అప్పగిస్తే బాగుంటుందని, 'స్పైడర్‌' బయో టెర్రరిజం నేపథ్యంలో యూనివర్శల్‌ సబ్జెక్ట్‌తో రూపొందుతుండటంతో జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తే 'స్పైడర్‌' కూడా ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. కానీ ఇది జరగని పని అని, ఈ చిత్రం కేవలం తమిళ, తెలుగు భాషల్లోనే రిలీజ్‌ అవుతుందని, ఈ చిత్రం ఇక్కడ హిట్టయితే తానే నిర్మాతగా మురుగదాస్‌ ఓ బాలీవుడ్‌ స్టార్‌తో దీనిని రీమేక్‌ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Spyder Hindi Market Updates:

Prince Mahesh Babu Movie Spyder Hindi Dubbing Rights decision in Namratha Sirodkar Hand
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs