Advertisement
Google Ads BL

ఈ హీరోలపై పొలిటికల్ గాసిప్స్ ఏంటో..?


చంద్రబాబునాయుడు మరలా నందమూరి కుటుంబ సభ్యులతో మంచి స్నేహం కోసం ప్రయత్నిస్తున్నాడన్న మాట నిజమే. తనతో పాటు బాలయ్య కూడా ఉన్నప్పటికీ హరికృష్ణకు చదలవాడ కృష్ణమూర్తి స్థానంలో టిటిడి చైర్మన్‌ పదవి ఇవ్వానున్నాడనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఇది నిజమేగానీ దీనికి బాలయ్య ఒప్పుకోవడంతో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున ప్రచారం చేయాలని, లోకేష్‌తో సఖ్యతగా ఉంటేనే ఆ పదవి ఇవ్వడం సాధ్యమవుతుందని అంటున్నారు. ఈ విషయంలో ఆయనకు కళ్యాణ్‌రామ్‌ నుంచి ఏమీ ఆశించకపోయినా హరికృష్ణ, జూనియర్‌, బాలయ్యలను ఒకటి చేస్తేనే ఇది సాధ్యమవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

మరోపక్క తాజాగా పవన్‌కి బదులు వచ్చే ఎన్నికల నాటికి అల్లుఅర్జున్‌, ప్రభాస్‌లు బిజెపికి సపోర్ట్‌ చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రత్యేకహోదా విషయంలో పవన్‌కు బిజెపికి విబేధాలు వచ్చిన నేపధ్యంలో కృష్ణంరాజు ద్వారా ప్రభాస్ కి, పవన్‌ యాంటీ పేరుతో బన్నీకి వారు దగ్గరవుతారనే పుకార్లు జోరందుకున్నాయి.

గత ఎన్నికల్లో కూడా మహేష్‌ బావ గల్లా జయదేవ్‌ గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే సమయంలో కూడా మహేష్‌ టిడిపికి ప్రచారం చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ మహేష్‌ తన బావను గెలిపించుకునే ప్రయత్నం చేశాడు గానీ టిడిపికి అంతటా సపోర్ట్‌ చేయలేదు. ఈసారి కూడా ఇలాంటి వార్తలే వస్తుండటం ఆశ్చర్యకరం. బన్నీకి ఇంకా బోలెడంత కెరీర్‌ ఉంది. వాటిని వదిలి, అసలే పవన్‌ ఫ్యాన్స్‌ వ్యతిరేకతతో ఉన్న బన్నీ పవన్‌కి పోటీగా ఆ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇక బన్నీ మామ ఎలాగూ రాజకీయాలలోనే ఉన్నా బన్నీ పట్టించుకోలేదు. 

ఇక ప్రభాస్‌కి అసలు కెరీర్‌ ఇప్పుడే ఆరంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణంరాజుకి గవర్నర్‌ పదవి ఇచ్చినా కూడా ప్రభాస్‌ రాజకీయాలలోకి ఇప్పుడే రాడు. కానీ ఆయన పెదనాన్న బిజెపి కాబట్టి.. ఎలాగూ ప్రభాస్‌ ఇమేజ్‌ ఇన్‌డైరెక్ట్‌గా బిజెపికి మేలు చేస్తుంది. అంతేగానీ ఇప్పటికిప్పుడు బన్నీ, ప్రభాస్‌లు రాజకీయలు పూసుకోరనే చెప్పాలి. 

Political Gossips on Tollywood Top Heroes:

Political Gossips on Young Tiger NTR, Allu Arjun and Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs