Advertisement
Google Ads BL

నిజమా..! ఎన్టీఆర్ సినిమాలో నారా రోహిత్తా!


ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం 'జై లవ కుశ' సినిమా షూటింగ్ లో బిజీగా వున్న తారక్ మరోపక్క బుల్లితెర మీద స్టార్ మా ఛానల్ లో 'బిగ్ బాస్' షో కి హోస్ట్ గా చేయనున్నాడు. ఇక ఈ రెండింటిని అక్టోబర్ ఎండింగ్ కి పూర్తి చేసి త్రివిక్రమ్ తో సినిమాని నవంబర్ లో సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ఈ లోపు త్రివిక్రమ్ కూడా పవన్ సినిమా విడుదలకు సంబంధించినవి చక్కబెట్టే పనిలో వున్నాడు.

Advertisement
CJ Advs

తారక్ - త్రివిక్రమ్ సినిమా అయితే మొదలవ్వలేదు గాని ఇప్పుడు ఈ సినిమాపై ఒక ఆసక్తికర కథనం ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతుంది. అదేమిటంటే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో ఒక యువ కథానాయకుడు కీ రోల్ చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. 'సోలో, జ్యో అచ్యుతానంద' చిత్రాలతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న నారా రోహిత్, ఎన్టీఆర్ సినిమాలో ఒక కీ రోల్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ న్యూస్ ఎంతవరకు నిజమనేది రోహిత్ గాని... త్రివిక్రమ్ గాని.. ఎన్టీఆర్ గానీ స్పందిస్తే తెలుస్తుంది.

అయితే ఇలా గెస్ట్ రోల్ లో నారా రోహిత్ కనిపించడమనేది కొత్తేమి కాదు. ఇదివరకే రవితేజ 'సారొచ్చారు' చిత్రంలో నారా రోహిత్ గెస్ట్ రోల్ లో మెప్పించాడు. అలాగే రోహిత్, ఎన్టీఆర్ కి స్వయానా బావ వరస అవుతాడు కూడాను. మరి వీరిద్దరూ కలిసి కనబడితే నారా, నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతారనేది వాస్తవం.

Nara Rohit Guest Role in Jr NTR Film:

Nara Rohit acted in Jr NTR and Trivikram Srinivas Movie. The Movie Sets After Pawan and Trivikram Movie. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs