Advertisement
Google Ads BL

బాలయ్య వర్సెస్‌ పూరీ.. ఎవరు గెలుస్తారో?


బాలకృష్ణ ఫ్లాప్‌ల్లో ఉన్న పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చినప్పుడు కొందరు నమ్మలేదు కానీ బాలయ్య హిట్‌ ఫ్లాప్‌ల రికార్డులను పట్టించుకోడని, కేవలం టాలెంట్‌ను మాత్రమే చూస్తాడని తెలిసిన వారు అది నిజమేనని నమ్మారు. ఇక ఈ చిత్రానికి అనూహ్యంగా పూరీ తన స్టైల్‌లో, బాలయ్య రూటును కూడా మార్చి 'పైసా వసూల్‌' అనే టైటిల్‌పెట్టాడు. ఇక ఇందులో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌ కావడంతో దోచుకున్న వారి నుండి సొమ్మును బాధితులకు ఇప్పించే పాత్రను చేస్తున్నాడని అంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇక పూరీ సినిమాలంటే సినిమా ఎలా ఉన్నా పైసా వసూల్‌ మూవీ అనే టాక్‌ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇది ఉభయతారకంగా ఉంటుందని భావించారేమో..! ఇక ఈ చిత్రంలో బాలయ్య తన తండ్రి సినిమాలోని పాటను రీమిక్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ గతంలో అలా బాలయ్య చేసిన 'నిప్పులాంటి మనిషి, అల్లరిపిడుగు, ఒక్కమగాడు' వంటి చిత్రాలన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో బాలయ్య సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా పూరీ రీమిక్స్‌ పాటను పెట్టడం ఏమిటా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

కానీ గతంలో పూరీకి, మహేష్‌కి స్టార్‌డమ్‌ని తెచ్చి, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'పోకిరి' చిత్రంలో మహేష్‌ తండ్రి కృష్ణ నటించిన 'గలగల పారుతున్న గోదారిలా..' పాటను రీమిక్స్‌ చేసి అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. స్టార్‌ దర్శకునిగానిలిచాడు. సో.. 'పైసా వసూల్‌'చిత్రం బాలయ్య సెంటిమెంట్‌ను ఫాలో అవుతుందో లేక పూరీ సెంటిమెంట్‌ని, నమ్మకాన్ని నిలబెడుతుందేమో వేచిచూడాల్సివుంది...! 

Balakrishna and Director Puri Jagannadh in Paisa Vasool Movie:

Some people did not believe when news came that Puri Jagannath's directorial debut in Balakrishna Flops. But knowing that Balayya does not care about hit flops records, he only sees the talent, believes that it is true.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs