Advertisement
Google Ads BL

వావ్..! అనిరుధ్.. ఇది మ్యూజిక్కా..మ్యాజిక్కా!


కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత అంతటి ఫాలోయింగ్‌, రజనీ కంటే ఎక్కువ మహిళాభిమానులున్న స్టార్‌ అజిత్‌. ఆయన కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. ఇక తాజాగా 'వీరం, వేదాళం' తర్వాత డైరెక్టర్‌ శివ-అజిత్‌ల కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ 'వివేగం'. 'వీరం, వేదాళం'లాగానే ఈ చిత్రానికి కూడా 'వి' సెంటిమెంట్‌ వచ్చేలా అజిత్‌ ప్లాన్‌ చేశాడు. తన కెరీర్‌లో అతను నటిస్తున్న అత్యంతభారీ బడ్జెట్‌ చిత్రం ఇదే కావడం విశేషం. ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా అజిత్‌ నటిస్తుండంతో ఈ చిత్రాన్ని ప్రపంచంలోని డజనుకు పైగా దేశాలలో చిత్రీకరించారు. సినిమా ప్రారంభం నుండి సంచలనాలను రేపుతోన్న ఈ చిత్రం లుక్స్‌లో అజిత్‌ సిక్స్‌ప్యాక్‌తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs

కాగా ఈ చిత్రానికి సంగీత సంచలనం అనిరుద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. అనిరుద్‌ స్పెషాలిటీ ఏమిటనేది ఆయన ట్యూన్‌ చేసిన 'కొలవరి.. కొలవరి' పాటతోనే అర్ధమైపోతుంది. క్యాచీ తమిళ పదాలకు, ఇంగ్లీషు మాటలను కూడా జోడించి పాటలు రాయించి కంపోజ్‌ చేయడంలో అనిరుధ్‌ దిట్ట. ఇక తాజాగా 'వివేగం'లోని 'సూరివా' అనే పాట టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాట ప్రస్తుతం తమిళనాట సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. టీజర్‌ను చూస్తుంటేనే ఈ పాట మరో కొలవరి కావడం ఖాయంగా అనిపిస్తోంది. ఈ పూర్తి పాటను ఈనెల 19న విడుదల చేయనున్నారు. పూర్తి పాటను గానీ రిలీజ్‌ చేస్తే ఈ పాట 'కొలవరిని' మించిన స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి! 

Anirudh another Kolaveri in Ajith Vivegam:

Anirudh Vivegam Surviva Song Teaser creates Sensation in Kollywood. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs