Advertisement
Google Ads BL

అమలాపాల్ కి మళ్లీ పెళ్లి....!!


అమలా పాల్ సినిమాలతో కంటే ప్రేమ, పెళ్ళి, విడాకులు వంటి వాటితోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న టైం లో తమిళ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లాడిన అమల రెండేళ్లకే భర్త విజయ్ తో విడాకులు తీసుకుని ఇప్పుడు సింగిల్ గా ఉంటుంది. అయితే అమల తన అత్తమామల వేధింపుల వల్లే విడాకులు తీసుకున్నానని చెప్పినప్పటికీ... అమలకు కోలీవుడ్ స్టార్ హీరోతో ఉన్న ఎఫ్ఫైర్ వల్లే విడాకులు తీసుకుందని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక ఆ విడాకుల వ్యవహారం ముగిశాక అమల మళ్ళీ సినిమాలతో కాస్త బిజీ అయ్యింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఆమె మళ్ళీ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ మధ్యన సూచి లీక్స్ పేరుతొ కొంతమంది సెలబ్రిటీస్ పరువు రోడ్డున పడిన విషయం తెలిసిందే. అయితే ధనుష్ మీద కోపంతోనే సింగర్ సుచిత్ర ...వాళ్ళ పర్సనల్ లైఫ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం రేపింది. అయితే ఈ మధ్య మళ్ళీ సూచి లీక్స్ పార్ట్ 2  అంటూ కొన్ని వదంతులు వ్యాపించిన వేళ  అమల ఆ సూచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నానని.... ఆ వీడియోస్ లో ధనుష్ తో తానెలా ఉన్నానో చూసుకోవాలని ఉందని చెప్పి సంచలనం రేపింది. అయితే అప్పట్లో అమల, ధనుష్ లు కూడా బాగా క్లోజ్ గా ఉండేవారని బాగా ప్రచారం జరిగింది.

ఇక ఇప్పుడేమో సినిమాలతో బిజీగా వున్నా కూడా ప్రేమ, పెళ్లి అంటూ అప్పట్లో కాస్త తొందర పడ్డానని.... కానీ ఇప్పుడు అన్ని ఆలోచించాకే పెళ్లి చేసుకుంటానని.... అదీ ప్రేమించే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. మరి మొదటి పెళ్లి పెటాకులైనా కూడా అమల ఇలా స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం కూడా చెబుతుంది. తాను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి తానేమి సన్యాసిని కాదని, అందుకే ప్రేమ పెళ్లి చేసుకుంటానని సెలవిచ్చింది.

Amala Paul Talks of second Marriage:

Divorced Actress Amala Paul Gears up for Second Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs