Advertisement
Google Ads BL

బన్నీతో ఛాన్స్...భార్యగా ప్రమోషన్..!


ఎట్టకేలకు వక్కంతం వంశీ డైరెక్టర్ గా సినిమా మొదలైంది. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్ లో 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' సినిమా పూజా కార్యక్రమాలతో ఆఫీషియల్ గా మొదలైంది. అయితే 'డీజే' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ త్వరలోనే 'నా పేరు సూర్య...' షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలు కానుంది. అయితే సినిమాకి అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు కానీ... బన్నీ పక్కన జోడి కట్టే భామను మాత్రం ఫైనల్ చెయ్యలేదు.

Advertisement
CJ Advs

అయితే అల్లు అర్జున్ పక్కన 'నా పేరు సూర్య...'లో నటించే హీరోయిన్ ని కన్నడ ఇండస్ట్రీ నుండి తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. వెండితెరకు పరిచయమైన సినిమా కిరాక్ పార్టీ తోనే అందరి చూపుని తనవైపు తిప్పుకున్న రష్మిక మండన్న ని అల్లు అర్జున్ కి జోడిగా సెలెక్ట్ చేస్తున్నట్లు టాక్ వినబడుతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో  రష్మిక మండన్నా, నాగ సౌర్య కి జోడిగా ఒక చిత్రానికి బుక్ అయ్యింది. అలాగే రామ్ కొత్త సినిమాలో కూడా రష్మిక మండన్నాని తీసుకున్నారని అంటున్నారు. ఇక ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ అయిన అల్లు అర్జున్ సినిమాలో కూడా నటిస్తే రష్మిక మండన్నా దశ ఒక దెబ్బకి తిరిగినట్లే.

ఇక నటించిన ఒక్క సినిమాతో ఎంతో ఫేమస్ అయిన రష్మిక మండన్నా తన మొదటి సినిమా దర్శకుడు, హీరో అయిన రక్షిత్ తో ప్రేమలో పడి పెళ్లిదాకా వచ్చేసింది. మరి ఒకే ఒక్క సినిమాతోనే అన్ని భాషల దర్శక నిర్మాతలను తనవైపు తిప్పుకున్న రష్మిక మండన్న కి లక్కు, కాలం రెండూ ఒకేసారి కలిసొస్తున్నాయ్. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు అటు రీల్ లైఫ్ లోనూ... ఇటు రియల్ లైఫ్ లోనూ రష్మిక ఒకేసారి సెటిల్ అవుతుందన్నమాట.

Rashmika Busy with Movies and Personal Life:

Rashmika mandanna got Chance with Allu Arjun in Naa Peru Surya Naa Illu India Movie. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs