రకుల్‌ప్రీత్‌సింగ్.. ఇప్పుడు ఎవరి నోట విన్నా అదేమాట. ఇక రెజీనాతో పాటు పలువురు తన సమకాలీకులు హీరోయిన్లుగా చాన్స్‌లు దక్కించుకోలేకపోతున్నా.. ఈమె మాత్రం జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతోంది. కాగా ఆమె తన కెరీర్ మొదట్లో ఒకరకమైన రెమ్యూనరేషన్ తీసుకున్నా కూడా ఒక్కసారి స్టార్ హీరోల దృష్టిలో పడిన తర్వాత మాత్రం కొండ మీద కొతి కావాలనేంతగా మారిపోయింది. కానీ అదృష్టం బాగుండటంతో ఆమె వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది.
ఇక ఆమెకు 'బ్రహ్మూెత్సవం' చిత్రంలో మెయిన్ హీరోయిన్ రోల్ వచ్చినా కూడా డేట్స్ కుదరలేదని తప్పుకుంది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో తాను నటించకపోవడమే మేలైనానని సన్నిహితులకే కాదు. మీడియాకు కూడా చూచాయగా చెప్పింది. మహేష్ పక్కన అవకాశం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆమె ఆ అవకాశం మిస్ చేసుకుంది. అయినా ఎలాగోలా మురుగదాస్, మహేష్‌బాబుల పుణ్యామా అని.. అనేక ఇతర కారణాల వల్ల తెలుగు, తమిళంలో భారీఎత్తున రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పైడర్'కు ఎంపికైంది. దాంతో మహేష్‌తో చేయని లోటును తీర్చుకుంటూ, ఏకంగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళంలో తన పేరు మరలా మారుమోగేలా చేస్తోందని ఆనందపడుతోంది.
ఇక ఈ చిత్రం వీలుంటే బాలీవుడ్‌లోకి కూడా రీమేక్ అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఆమె నక్క తోకను తొక్కినట్లే. ప్రస్తుతం తాను పెట్టిన నిబంధనలు, భారీ రెమ్యూనరేషన్ కోసం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. తాజాగా విడుదలైన 'రారండోయ్ వేడుక చూద్దాం'లో పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర అయిన భ్రమరాంబను అద్భుతంగా పడించింది. ఇక ఈ అమ్మడు ఒక పవన్ కళ్యాణ్‌తోనే నటించడం నా లక్ష్యమంటోంది. వాస్తవానికి పవన్ ఆమెను 'సర్దార్ గబ్బర్ సింగ్'లోనే పెట్టుకోవాలనుకున్నాడు.ఇక ఆమె రెమ్యూనరేషన్, డేట్స్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వంటివన్నీ చూసి కాజల్‌ని తీసుకున్నాడు.
అదృష్టవశాత్తు ఈ చిత్రం కూడా డిజాస్టర్ కావడంతో ఉప్పొంగిపోయి, తాను చేయకపోతే సినిమా ఫ్లాప్ అనే మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పుడేమో పవన్‌తో నటించడమే తన గోల్ అంటోంది. అయిన ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్న పవన్ ఎన్నికలు దగ్గరపడుతున్నందువల్ల ఇక ఎన్నో సినిమాలలో నటించకపోవచ్చు. ఆ తర్వాత చేస్తాడా? అంటే అప్పటికి రకుల్ పరిస్థితి ఏమిటో ఎవ్వరికీ తెలియదు. మరి రకుల్ కోరిక నెర వేరుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది..!