Advertisement
Google Ads BL

బాలయ్య.. వాళ్ల నాన్నంతటి వాడట...?


ఏ హీరో తమకు డేట్స్‌ ఇస్తే ఆ హీరోని పొగడ్తలతో ముంచి భజన చేయడం మామూలే. తాజాగా బాలయ్య పూరీజగన్నాథ్‌తో 'పైసా వసూల్‌' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఫామ్‌లో లేని తమిళ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయి హిట్‌ని ఆయన అందివ్వలేకపోయాడు. ఇక 'లింగా' చిత్రం చూస్తే రవికుమార్‌ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా లేడని, ఆయన ఇక సినిమాలు మానేయడమే బెటర్‌ అనిపించకమానదు. 

Advertisement
CJ Advs

అయినా కూడా అడిగిన వెంటనే వరాలిచ్చే ఏడుకొండల వాడు వంటి బాలయ్య ఆయనకు సినిమా చేస్తున్నాడు. ఇక తాజాగా బాలయ్య నటించిన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ లాంచ్‌ జరిగింది. దీనికి రవికుమార్‌ ముఖ్యఅతిధిగా హాజరై బాలయ్యతో పాటు అందరినీ తన పొగడ్తల వర్షంలో తడిసి ముద్దచేశాడు. 'గౌతమీ పుత్రశాతకర్ణి'ని బాలయ్య-క్రిష్‌లు కేవలం 79రోజుల్లో పూర్తి చేశారంటే నమ్మలేకపోతున్నానని చెప్పాడు. బాలయ్యకు వాళ్ల నాన్న క్రమశిక్షణే వచ్చిందని పొగిడాడు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ను రవికుమార్‌ గుర్తు చేసుకున్నాడు. రవికుమార్‌కి ఒకప్పటి తమిళ, తెలుగు టాప్‌ కమెడియన్‌ నగేష్‌ ఒకసారి ఇలా చెప్పాడట. 

నేను ఎన్టీఆర్‌ గారి చిత్రం షూటింగ్‌ కోసం మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కి వెళ్లడానికి విమానం ఏక్కాలని వెళ్లాను. విమానం మిస్సయింది. దాంతో భయపడుతూ తర్వాతి విమానం ఎక్కాను. తీరా చూస్తే ఎన్టీఆర్‌గారు కృష్ణుడి వేషం వేసుకుని,మేకప్‌తోనే విమానంలో ఉన్నారు. అదేంటి అని అడిగితే.. మనం హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత ఈ కృష్ణుడి మేకప్‌ వేసుకోవాలంటే రెండు గంటలకు పైగా పడుతుంది. షూటింగ్‌ లేటవుతుంది. అందుకే చెన్నైలోనే మేకప్‌ చేయించుకుని విమానం ఎక్కాను అని నగేషకి చెప్పారట. ఆ విషయాన్ని నగేష్‌ తనకు చెప్పుకొచ్చాడని అన్నాడు. అంతేకాదు బాలయ్య అన్ని విషయాలలోనూ ఆయన తండ్రికి తీసిపోరని పొగడ్తలు గుప్పించాడు. 

పనిలో పనిగా రవికుమార్‌ తాను రజినీతో దాదాపు 300రోజుల కాల్షీట్స్‌తో 'రాణా' అనే పెద్ద చిత్రం తీయాలనుకున్నాను అని తెలుపుతూ చివర్న క్రిష్‌ని చూసి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ రవికుమార్‌ పొగడ్తలు గుప్పించాడు.ఇక పనిలో పనిగా తాను రజినీతో 'రాణా' తీసి ఉంటే బాహుబలిని వంటి చిత్రాన్ని తానే ఎప్పుడో తీసి వుండేవాడినని చెప్పుకొచ్చాడు. 

Balakrishna and Senior NTR is Same to Same:

If any hero gives dates to them, it is normal to breathe with the praise of the hero. Balayya is doing the film 'Paisa Vasool' with Puri Jagannath. The film will be directed by Tamil director KS Ravikumar who is not in the form afterwards. Recently, the 100th film 'Gauthamiputra Sathakarni' trailer was launched. Ravikumar appeared as the chief guest and Balayya along with her smoothed in the rain.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs