'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి హోస్ట్‌గా నాగార్జున పనిచేసినంతకాలం టీఆర్పీ రేటింగ్స్ తగ్గుతూ వచ్చినా పూర్తిగా పడిపోలేదు. కానీ చిరంజీవి వచ్చిన తర్వాత మాత్రం ఘోరమైన ఫ్లాప్‌ని ఆ షో రుచిచూసింది. ఇమేజ్‌పరంగా చిరు నాగ్ కంటే పై మెట్టునే ఉన్నా కూడా బుల్లితెరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఇక తాజాగా ఎన్టీఆర్ 'బిగ్‌బాస్'కి ఒప్పుకుంటే, 'భళ్లాలదేవ' 'నెం1 యాయిరే' షోకి ఓకే చేశాడు.
ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' చేయడానికి భారీ రెమ్యూనరేషన్‌తో పాటు ముంబైలో ఖరీదైన సెట్స్ వేసి తీయాలని, నెంబర్‌వన్ టెక్నీషియన్స్‌ని, తాను సూచించిన వారినే పెట్టుకోవాలనే పలు నిబంధనలను స్టార్ మా నిర్వాహకులకు చెప్పాడు. దాంతో ఈ షోకి భారీగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. అయినా మంచి టీఆర్పీతో తమకు భారీ లాభాలను తెచ్చిపెట్టగలడని యాజమాన్యం నమ్ముతోంది. వాస్తవానికి చిరు, నాగ్‌లు హోస్ట్‌లుగా ఉన్నప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన తీసుకోలేదు. సాదాసీదాగా హైదరాబాద్ స్టూడియోలలోనే షో చేశారు.
కానీ 'బిగ్‌బాస్' పరిస్థితి వేరుగా ఉంది. మరోపక్క రానా జెమినీ టీవీకి చేయనున్న 'నెంబర్1 యాయీరే' షోని తక్కువ రెమ్యూనరేషన్‌తో పాటు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లోనే షూటింగ్ చేయనున్నారు. ఇక ఎన్టీఆర్, రానా ఇద్దరిలో ఉన్నది ఏమిటంటే మంచి స్వరం, వాగ్దాటి, సమయస్ఫూర్తి, మంచి బాడీ లాంగ్వేజ్. ఇక ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' అయితే తెలుగు ప్రేక్షకులకు మరీ కొత్త. కానీ రానా చేయబోయే షో రొటీన్ అని సమాచారం. సినిప్రముఖులను పిలిచి వారి మనసులో ఉన్న భావాలను చెప్పించడమే.
ఇప్పటికే అలీ, సుమ వంటి వారు ఇలాంటివి చేస్తున్నారు. దాంతో రానా షో రొటీన్ అని కొందరు అప్పుడే పెదవి విరుస్తున్నారు అయినా ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? తనకంటే భారీ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్‌ను రానా మెప్పిస్తాడేమో? అనే క్యూరియాసిటీ కలుగుతోంది. చిరుని నాగ్ డామినేట్ చేసినట్లు ఎన్టీఆర్‌ని రానా బుల్లితెరపై మరిపిస్తాడేమో చూడాలి...!