Advertisement
Google Ads BL

ఈ జంట మళ్లీ..పుకార్లకు తెరలేపారు..!


నిఖిల్ ఇప్పుడు మంచి ఫామ్ లో వున్నాడు. చేసిన ప్రతి సినిమా హిట్టవ్వడంతో నిఖిల్ మంచి జోష్ లో వున్నాడు. అయితే నిఖిల్ మీద ఒకప్పుడు కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయన్న సంగతి విదితమే. అదేమిటంటే స్వాతి రెడ్డితో నిఖిల్ రెండు సినిమాలు చేసాడు. ఆ రెండు సినిమాలు హిట్టవ్వడంతో వీరిద్దరికి హిట్ ఫెయిర్ గా పేరొచ్చేసింది. దాంతో వీరిద్దరి మధ్యన ఏదో ఉందనే పుకారు బయలుదేరింది. ఇక ఆ పుకార్లు బాగా ఎక్కువవడంతో వీరిద్దరూ కలిసి సినిమాలు చేయ్యడం ఆపేసారు. దాంతో అప్పట్లో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ వీరి ఎఫ్ఫైర్ పై సోషల్ మీడియాలో కథనాలు స్టార్ట్ అయ్యాయి. ఎలా అంటే నిఖిల్, స్వాతి లు ఇద్దరూ ఒకే వేదిక మీదకి రావడంతో మళ్ళీ వీరిద్దరిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్వాత్తి రెడ్డి నటించిన లండన్ బాబులు చిత్రం ట్రైలర్ లాంచ్ కోసం నిఖిల్ గెస్ట్ గా హాజరయ్యాడు. హాజరయితే హాజరయ్యాడు గాని స్వాతి మీద పొగడ్తల వర్షం కురిపించేసాడు. ఇక స్వాతి కూడా నిఖిల్ ని తెగ పొగిడేసింది. నిఖిల్, స్వాతి గురించి మాట్లాడుతూ స్వాతి ఒక సినిమాని ఒప్పుకుంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందని....  స్వామి రారా కథ విన్నప్పుడు స్వాతి ఈ సినిమా  హిట్ అవుతుందని అప్పుడే చెప్పేసింది. తనలో ఓ దర్శకురాలుతో పాటు రచయిత కూడా దాగుందని పొగిడేసాడు.

ఇక ఇదంతా విన్న స్వాతి, నిఖిల్ కి థాంక్స్ చెప్పడంతోపాటు.... నిఖిల్ తో నటించిన సినిమాలతోనే తనకు స్టార్ డమ్ వచ్చిందని చెప్పింది. మరి వారు ఇలా ఒకరినొకరు పొగుడుకోవడం చూస్తుంటే ఇలాంటి పుకార్లకు ఊతమిచ్చినట్టు లేదూ..! 

Again Gossips Raised on Swathi and Nikhil:

Nikhil Praises Swathi Reddy at London Babulu Trailer Launch. Swathi Redday also Praises Nikhil in same Stage. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs