Advertisement
Google Ads BL

చైతూ.. పెద్ద ప్లానే వేశాడండోయ్!


అక్కినేని ఫ్యామిలీ అంటేనే మాస్టర్‌ బ్రెయిన్‌ అన్న సంగతి తెలిసిందే. స్వర్గీయ ఏయన్నార్‌ నుంచి నాగార్జున వరకు అందరూ బంధాలను బంధంలాగా, వ్యాపారాన్ని వ్యాపారంలాగానే చూస్తారు. ఎక్కడైనా బావే... కానీ వంగతోట కాడ కాదు.. అన్నట్లు, బామ్మర్ది బామ్మర్దే... పేకాట పేకాటే అన్న సామెతలు వారికి బాగా సరిపోతాయి. ఇక నాగార్జున పెద్ద కుమారుడు చైతూ కూడా సామాన్యుడు కాదని నిరూపించుకుంటున్నాడు. చైతూ త్వరలో సమంతను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో చైతూ మరో తెలివైన నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. 

Advertisement
CJ Advs

చైతూ ఇప్పటివరకు కేవలం టాలీవుడ్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల ఆయన తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేయనున్నాడని, ప్రస్తుతం ఆయన చేస్తోన్న కృష్ణ వైరిముత్తు చిత్రం ద్విభాషా చిత్రమని ప్రచారం జరిగినా కాదని తేలిపోయింది. ఇప్పుడు మహేష్‌, ప్రభాస్‌ల నుంచి సందీప్‌ కిషన్‌ వరకు ఇతర భాషలపై మరీ ముఖ్యంగా కోలీవుడ్‌పై దృష్టిపెడుతున్నారు. కాగా తమిళంలో చైతూకి ఏమాత్రం ఇమేజ్‌ లేదు. కానీ ఆయన కాబోయే భార్య సమంతకి మాత్రం కోలీవుడ్‌లో మంచి మార్కెట్‌ఉంది. చెన్నై సుందరి కావడంతోపాటు ఆమె పలువురు అగ్రహీరోల సరసన కూడా తమిళంలో చేసింది. కాబట్టి తమిళంలో సమంతకు ఉన్న క్రేజ్‌ను చైతూ క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నాడు. 

ఇప్పటికే చైతూ, సమంతలకు గాడ్‌ ఫాదర్‌ వంటి గౌతమ్‌మీనన్‌ తానే చైతూని కోలీవుడ్‌కి పరిచయం చేస్తానని మాట ఇచ్చాడు. దాంతో సమంతను పెళ్లిచేసుకున్న వెంటనే ఓ కీలకపాత్రను సమంతకు ఇచ్చి గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలోనే చైతూ కోలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వాలని, కాబట్టే తొందరపడకూడదని నిర్ణయించుకున్నాడట...! 

Naga Chaitanya Superb Planning:

Naga Chaitanya will Enters Kollywood After his Marriage. Gautham Menen will Direct this Movie and Samantha Play a Key Role. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs