Advertisement
Google Ads BL

చరణ్-ఉపాసన పెళ్లిరోజు వేడుక కూడా అక్కడే!


మెగాహీరో రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985'  సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్ కి జోడిగా నటిస్తున్న సమంత కారణంగా, వడగాల్పుల కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది ఈ సినిమా. ఇక ఇప్పటివరకు పల్లెటూరి వాతావరణం కోసం కొల్లేరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. మరి ఈ చిత్రం మొత్తం పల్లెటూరి వాతావరణంలో ఉండబోయే ప్రేమ కథ కాబట్టి ఎక్కువ శాతం ఆ పల్లెటూర్లలోనే షూటింగ్ చెయ్యాలి కాబట్టి ఇప్పుడు ఈ షెడ్యూల్ కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది.

Advertisement
CJ Advs

అయితే ఇక్కడ షూటింగ్ జరిగే చోట ఒక ఆసక్తికర ఘటన జరిగింది. అదేమిటంటే ఎవరైనా తమ పెళ్లి రోజును ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. కానీ రామ్ చరణ్, సుకుమార్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడం వలన ఆ వేడుకని చాలా సింపుల్ గా చిత్ర యూనిట్ మధ్యలో ఉపాసనతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడట.  షూటింగ్ లో  బిజీగా ఉండడంతో చరణ్ పెళ్లిరోజు వేడుకకి హైదరాబాద్ రాలేకపోయాడట. అయితే ఈ పెళ్లి రోజు కోసం ఉపాసన షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ని డిస్ట్రబ్ చేయకుండా తానే రాజమండ్రికి వెళ్లిందట. ఇక అక్కడ రామ్ చరణ్ తో కలిసి తమ ఐదవ పెళ్లిరోజును సింపుల్ గా చేసేసుకుందట. ఇక షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు ఉన్న ఉపాసన ‘మిస్టర్ అండ్ మిసెస్ సి’కి ఐదేళ్లు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాల కారణంగా ఇన్నేళ్లూ సంతోషంగా గడిచాయంటూ సోషల్ మీడియాలో అందరికి కృతజ్ఞతలు తెలిపింది.  

Ram Charan, Upasana Five Years Of Married Life:

Ram Charan, Upasana have entered the wedlock and it has been five wonderful years of journey for both.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs