Advertisement
Google Ads BL

ఈ ఏడాదంతా నాగ్‌ బిజీయేనా..?


తన కుమారుల కెరీర్స్‌, వారి పెళ్లిళ్లు వంటి విషయాలతో పాటు నాగార్జున బిజీగా ఉన్నాడు. 'మనం, సోగ్గాడే చిన్నినాయనా' ఊపిరి' వంటి వరుస చిత్రాలతో ఆయనకు వచ్చిన విజయాలే కాదు.. ఆయనకొచ్చిన పేరు కూడా తక్కువేం కాదు. కానీ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నుంచి అన్ని తప్పుకొని చైతూ, అఖిల్‌ల కెరీర్‌ను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాడు. అందులో భాగంగానే తనకు 'సోగ్గాడే చిన్నినాయనా'వంటి బ్లాక్‌ బస్టర్‌నిచ్చిన కళ్యాణ్‌ కృష్ణ మీద నమ్మకంతో తానే నిర్మాతగా, ఖర్చుకు వెనుకాడకుండా చైతూని, రకుల్‌ని పెట్టి 'రారండోయ్‌ వేడుకచూద్దాం' నిర్మించాడు. మొదటి రోజు డివైడ్‌ టాక్‌ వచ్చినా తనకున్న సినీ పరిజ్ఞానంతో నిరాశపడలేదు. స్లో అండీ స్టడీగా అలాంటి టైటిల్‌, కథ ఉన్న చిత్రాలు ఉంటాయని ఆయనకు తెలుసు. 

Advertisement
CJ Advs

నేడు అదే చిత్రం భారీగా లాభాలు తెచ్చిపెడుతోంది. మరోపక్క తనకు 'మనం' వంటి హిట్‌ ఇచ్చిన విక్రమ్‌ కె.కుమార్‌కు అఖిల్‌ రెండో చిత్రాన్ని అప్పగించి, సినిమాకు కావాల్సినంత బడ్జెట్‌ కేటాయించడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి చిన్నగ్యాప్‌ వచ్చిందని సమాచారం. ఇండస్ట్రీలో ఎవరి నమ్మకాలు, ఎవరి మనస్తత్వం ఏమిటో తెలీదు గానీ నాగ్‌కి రీషూట్స్‌ చేయడంపై తప్పుడు అభిప్రాయం లేదు. ఆయన కెరీర్‌లోనే కాదు.. పలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ కూడా రీషూట్‌ చేసుకున్నవేనని ఆయనకు తెలుసు. 

అందుకే నాకు నచ్చందే సినిమా రిలీజ్‌ చేయను.. ప్రెస్‌మీట్‌ కూడా పెట్టనని చెప్పాడు. విక్రమ్‌ సినిమా స్టోరీలో కూడా కాస్త మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. ఇక ప్రస్తుతం తాను 'రాజు గారి గది2'లో నటిస్తున్నాడు. ఇదీ రీషూట్‌ కెళ్లిందంటున్నారు. మొత్తానికి బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వడం కోసం నాగ్‌ ఏమైనా చేస్తాడు. మరోపక్క అక్టోబర్‌ 6న చైతూ-సామ్‌ల పెళ్లి జరగనుంది. ఈ కోలాహలం ముగిసే సరికి ఈ ఏడాది సరిపోతుందని సమాచారం. 

దాంతో ఆయన ఆ తర్వాత కళ్యాణ్‌ కృష్ణతోనే 'బంగార్రాజు' చేయడం ఖాయం. 'రారండోయ్‌..'తో కళ్యాణ్‌ కృష్ణ తన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇవే కాక పలు ప్రాజెక్ట్స్‌ చర్చలు నడుస్తున్నాయి. వీటికి ఆయన వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు. 

Nagarjuna is Very Busy This Year?:

Nagarjuna is busy with his sons careers and their brides. We are with the successes of the films like 'Soggade Chinnnayaana', 'oopiri'. His name is not too short. Kalyan Krishna believes in himself as a producer, without spending the money and putting the Rakul's 'Randondoy Veduka Chuddam'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs