రీసెంట్ గా టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్ ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ప్రభాస్ - సల్మాన్ కలిసి మల్టి స్టారర్ చేయబోతున్నారని. ఇక ఈ మల్టి స్టారర్ కి దర్శకుడిని సెట్ చేశారు కొంతమంది. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి.. ప్రభాస్ - సల్మాన్ లతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని, స్టోరీ కూడా రెడీ చేశాడని కొద్ది రోజులుగా వార్త వినిపిస్తుంది. ఒకవేళ ఈ సినిమా గనక సెట్స్ మీదకెళితే ఈ సినిమాకి ప్రభాస్, సల్మాన్ ల పారితోషికాలను నిర్మాతలు చెల్లించగలరా? అంటూ ప్రచారం జరుగుతుంది.మరి బాహుబలితో ప్రభాస్ రేంజ్ 2000 కోట్లకి వెళ్ళిపోయింది. అలాగే భజరంగి భాయీజాన్, సుల్తాన్ చిత్రాలతో వందల కోట్లు కొల్లగొట్టే సల్మాన్ రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంటుంది.
ఇదంతా ఇలా ప్రచారం జరుగుతుండగా... బాహుబలి ఘన విజయంతో మంచి ఊపుమీదున్న హీరో ప్రభాస్ తన కొత్త సినిమాలకు.. పారితోషికాన్ని 80 కోట్లకు పెంచేశాడనే టాక్ బయలుదేరింది. మరి బాహుబలితో బాలీవుడ్ కి మార్గం సుగమం చేసుకున్న ప్రభాస్ ఇలా భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నాడనే న్యూస్ ని ఒక ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఇదే విషయమిప్పుడు సాంఘిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రేంజ్ పారితోషకాన్ని ప్రభాస్, రోహిత్ షెట్టి డైరెక్షన్ లో సల్మాన్ - ప్రభాస్ కలిసి చెయ్యబోయే మల్టి స్టారర్ కోసం డిమాండ్ చేస్తున్నాడని... ఒక ఆంగ్ల పత్రిక కథనం.
ప్రభాస్ ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చెయ్యడం వలెనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని... అంటుంది. అంటే ఆ సినిమా పట్టాలెక్కకపోవడానికి ప్రధాన అడ్డంకి ప్రభాస్ అంటుంది ఆ పత్రిక. మరోపక్క బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ షెట్టి మాత్రం ఈవార్తలో అసలు నిజం లేదని.. సల్మాన్, ప్రభాస్ చిత్రం వంటిది ఏం లేదని అది కేవలం ఒక రూమారని కొట్టిపారేశాడు. అసలు ఈ రూమర్ ఎలా వచ్చిందో తనకు తెలియదని రోహిత్ షెట్టి చెప్పడం కొసమెరుపు.